ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బంజారాలు సంఘటితమైతేనే రాజాఽ్యధికారం

ABN, Publish Date - Feb 25 , 2024 | 11:48 PM

బంజారాలు సంగటితమైతేనే రాజ్యాధికారం సాధ్యమని అల్‌ఇండియా బంజార సంఘం నాయకులు అన్నారు.

పట్టణంలో ర్యాలీ చేస్తున్న బంజారా సంఘం నాయకులు

కదిరిఅర్బన, ఫిబ్రవరి 25: బంజారాలు సంగటితమైతేనే రాజ్యాధికారం సాధ్యమని అల్‌ఇండియా బంజార సంఘం నాయకులు అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో ఆల్‌ఇండియా బంజార సేవా సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లానుంచి అధిక సంఖ్యలో బంజారులు పాల్గొన్నారు. ముందుగా సమావేశ ప్రాంగణం నుంచి కాలేజీ సర్కిల్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌, ఫూలే సర్కిల్‌ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ బంజారాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలన్నారు. ఏపార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందో వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. అనంతపురం జిల్లాలోని గుత్తిలో వెలసిన బంజారాల ఆరాధ్య దైవ్యం సేవాలాల్‌ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించాలన్నారు. తిరుమలలో ఉన్న అఖిరాం బాలాజీ మఠానికి బంజారాలచే కమిటీ ఏర్పాటుచేసి నిర్వహించాలన్నారు. బీసీ ఉపకులాలైన బోయ వాల్మీకి ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. గిరిజన తండాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. బంజారాలు ఏకతాటిపైకి వచ్చి డిమాండ్ల సాధనకోసం పొరాడాలన్నారు. ఆసంఘం నాయకులు రాంశంకర్‌నాయక్‌, డిటీ నాయక్‌, రవీంద్రనాయక్‌, వెంకటరమణనాయక్‌, చక్రీనాయక్‌, ఆంజనేయులునాయక్‌, కాలేనాయక్‌, బాలాజీనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 11:48 PM

Advertising
Advertising