BALAYYA : పురానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తా
ABN, Publish Date - May 09 , 2024 | 12:04 AM
నియోజకవర్గానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామని టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం గోళ్లాపురం, తూ ముకుంట, సంతేబిదునూరు, కొటిపి పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల కృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్ హయాంలో తూముకుంట పారిశ్రామికవాడకు పరిశ్రమలు తెచ్చామన్నారు. దీనివల్ల హిందూపురం మండలంలో భూముల విలువ అమాంతం గా పెరిగి రైతులకు మేలు జరిగిందన్నారు.
హిందూపురం, మే 8 : నియోజకవర్గానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామని టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం గోళ్లాపురం, తూ ముకుంట, సంతేబిదునూరు, కొటిపి పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల కృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్ హయాంలో తూముకుంట పారిశ్రామికవాడకు పరిశ్రమలు తెచ్చామన్నారు. దీనివల్ల హిందూపురం మండలంలో భూముల విలువ అమాంతం గా పెరిగి రైతులకు మేలు జరిగిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు తెస్తామన్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా మండలంలోని అన్ని చెరువులకు నీరందిస్తామ న్నారు. గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు నంది స్తామన్నారు. బెంగళూరు ప్రధాన రహదారిని మరింత విస్తరిస్తామని మరిన్ని గార్మెంట్ పరిశ్రమలు తీసుకొస్తానన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వ్యాపారులకు టీడీపీ అండ : వసుంధరా దేవి
నియోజకవర్గంలో ఉన్న ఆర్యవైశ్యుల ఆస్తులకు, వ్యాపా రాలకు టీడీపీ అండగా ఉంటుందని నందమూరి వసుం ధరాదేవి అన్నారు. స్థానిక వాసవీ ధర్మశాలలో బుధవారం రాత్రి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వసుంధరాదేవి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు టీడీపీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్నార న్నారు. హిందూపురం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండా లన్నదే నందమూరి బాలకృష్ణ ధ్యేయమన్నారు. మూ డోసారి బరిలో ఉన్న బాలకృష్ణకు, ఎంపీ అభ్యర్థి పార్థ సారథికి ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరా రు. మునిసిపల్ మాజీ చైర్‌పర్సన రావిళ్ల లక్ష్మి, ఐటీ వింగ్ ప్రతినిధి తేజశ్విని, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు జేపీకే రాము, కౌన్సిలర్ రాఘవేంద్ర, ఆదర్శ్‌కుమార్, కళావతి, రూపాదేవి, గీత తదితరులు పాల్గొన్నారు.
లేపాక్షి : మండలంలోని బయన్నపల్లి, బసవనపల్లి, మామిడిమాకులపల్లి, మద్దిపి గ్రామాల్లో బుధవారం నందమూరి వసుంధరాదేవి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 09 , 2024 | 12:04 AM