ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MSR: సా్ట్రంగ్‌రూమ్‌లను పరిశీలించిన ఎంఎస్‌ రాజు

ABN, Publish Date - May 26 , 2024 | 11:56 PM

నియోజకవర్గం సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన హిందూపురం బిట్‌ కళాశాలలో స్ర్టాంగ్‌ రూమ్‌లను టీడీపీ మడక శిర ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆదివారం పరిశీలించారు. ఈవీఎం భద్రపరిచిన కేంద్రాల వద్ద ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటున్నారు. తదదితర అంశాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకొన్నారు.

MS Raju, Gundumala Tippeswamy and others inspecting the strong rooms

మడకశిర టౌన, మే 26: నియోజకవర్గం సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన హిందూపురం బిట్‌ కళాశాలలో స్ర్టాంగ్‌ రూమ్‌లను టీడీపీ మడక శిర ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆదివారం పరిశీలించారు. ఈవీఎం భద్రపరిచిన కేంద్రాల వద్ద ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటున్నారు. తదదితర అంశాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. వచ్చే నెల 4న మడకశిర నియోజకవర్గం ఓట్లు లెక్కింపును బిట్‌ కళాశాలలో నిర్వహించనున్నారు. అందుకు సంబం ధించి నియోజకవర్గం ముఖ్య నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు.


కార్యకర్తలకు అండగా ఉంటాం : గుండుమల

మడకశిర రూరల్‌ : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, పా ర్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. మండలంలోని గౌడనహళ్లి కి చెందిని టీడీపీ సీనియర్‌ నాయకుడు నాగరాజు గుండెపోటుతో ఇటీవల మృతి చెందాడు. గుండుమల, ఎంఎస్‌ రాజు ఆదివారం ఆ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని, టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. వారి వెంట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి, క్లస్టర్‌ ఇనచార్జ్‌లు నాగ రాజు, అశ్వత్థనారాయణ, మాజీ సర్పంచు నరసింహప్ప, కార్యకర్తలు ఉన్నారు.


టీడీపీ నాయకులను పరామర్శించిన సవిత

పెనుకొండ రూరల్‌ : సోమందేపల్లి మండలం జూలకుంట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు హనుమంతు కుమారుడు మారుతి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదేవిధంగా నడింపల్లికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు తిరుపతయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్సపొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆయా గ్రామాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 26 , 2024 | 11:56 PM

Advertising
Advertising