LAND : ఓపెన సీక్రెట్‌..!

ABN, Publish Date - Jul 03 , 2024 | 11:47 PM

ఆయనో రెవెన్యూ ఉద్యోగి. అనంతపురం అర్బన తహసీల్దారు కార్యాలయంలో పనిచేస్తుంటారు. వేతనం బాగానే ఉంటుంది. అది చాలదో ఏమో.. తన ఇంటి వద్ద లే అవుట్‌లో ప్రజల అవసరాలకు వదిలిన స్థలాన్ని ఆక్రమించాడు. ఇతరులకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా సాగుతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. అనంతపురం రూరల్‌ మండలంలో ఈ తతంగం సాగుతోంది. కురుగుంట గ్రామ పొలం సర్వే నంబర్లు 104-2బి, 105-2ఎ, 2బిలో 4.67 ఎకరాలు భూమి ఉంది. కొన్నేళ్ల కిందట ఆ భూమిలో ప్రస్తుతం అనంతపురం అర్బన తహసీల్దార్‌ కార్యాలయంలో...

LAND : ఓపెన సీక్రెట్‌..!
Open site

పంచాయతీ స్థలాన్ని ఆక్రమించిన ఉద్యోగి

గతంలో లే అవుట్‌ వేసింది ఆయనే..

అనంతపురం రూరల్‌, జూలై 3: ఆయనో రెవెన్యూ ఉద్యోగి. అనంతపురం అర్బన తహసీల్దారు కార్యాలయంలో పనిచేస్తుంటారు. వేతనం బాగానే ఉంటుంది. అది చాలదో ఏమో.. తన ఇంటి వద్ద లే అవుట్‌లో ప్రజల అవసరాలకు వదిలిన స్థలాన్ని ఆక్రమించాడు. ఇతరులకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా సాగుతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. అనంతపురం రూరల్‌ మండలంలో ఈ తతంగం సాగుతోంది. కురుగుంట గ్రామ పొలం సర్వే నంబర్లు 104-2బి, 105-2ఎ, 2బిలో 4.67 ఎకరాలు భూమి ఉంది. కొన్నేళ్ల కిందట ఆ భూమిలో ప్రస్తుతం అనంతపురం అర్బన తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోయగి లే అవుట్‌ వేశారు. అప్పటికి ఆయనకు ఇంకా ఉద్యోగం రాలేదు. లే


అవుట్‌లో రోడ్లు పోగా.. 67 ప్లాట్లు వేశారు. ప్రజా అవసరాల నిమిత్తం పంచాయతీకి 46.7 సెంట్లు ఓపెన సైట్‌ వదిలారు. ఆయన కూడా అదే లే అవుట్‌లోని ప్లాట్‌లో ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఓపెన సైట్‌ను తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఆ స్థలాన్ని ఇతరులకు బాడుగకు ఇచ్చారు. వారి నుంచి ప్రతి నెలా రూ.20 వేల వరకు ఆయన ఖాతాలో చేరుతోందని సమాచారం. ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు ఓపెన సైట్‌ను స్వాధీనం చేసుకోవడం లేదు. నిత్యం అదే దారిలో వెళ్లే పంచాయతీ అధికారులకు ఆక్రమణ గురించి తెలియదా..? అన్న చర్చ జరుగుతోంది. ప్లానలో ఓపెన సైట్‌ అని కనబరిచినా.. అధికారుల్లో చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 03 , 2024 | 11:47 PM

Advertising
Advertising