ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SAVITA : చంద్రబాబుతోనే పాలసముద్రం ప్రఖ్యాతి

ABN, Publish Date - May 04 , 2024 | 11:21 PM

మండలంలోని పాలసముద్రం ప్రాంతం ప్రపంచ పటంలో గుర్తింపు వచ్చేలా చేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదే అని టీడీపీ కూట మి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. గోరంట్ల మం డలంలోని పాలసముద్రం, వడిగేపల్లి, రెడ్డిచెరువుపల్లి పంచాయతీ గ్రామాల్లో రోడ్‌షో ద్వారా సవిత శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాల సముద్రంలో పెద్దఎత్తున జనం తరలివచ్చి గజమాల లు, హారతులు, పూల వర్షంతో ఆమెకు ఘనస్వాగతం పలికారు.

MLA candidate Savitha is campaigning in Palasamudra

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత

ప్రచారానికి అపూర్వ ఆదరణ

గోరంట్ల, మే 4: మండలంలోని పాలసముద్రం ప్రాంతం ప్రపంచ పటంలో గుర్తింపు వచ్చేలా చేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదే అని టీడీపీ కూట మి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. గోరంట్ల మం డలంలోని పాలసముద్రం, వడిగేపల్లి, రెడ్డిచెరువుపల్లి పంచాయతీ గ్రామాల్లో రోడ్‌షో ద్వారా సవిత శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాల సముద్రంలో పెద్దఎత్తున జనం తరలివచ్చి గజమాల లు, హారతులు, పూల వర్షంతో ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... కియ పరిశ్రమ ద్వారా జిల్లాలోని యువతకు భవిష్యత్తు చూపింది టీడీపీనే అన్నారు. పాలసముద్రం వద్ద నా సిన, బెల్‌ తదితర పరిశ్రమల ఏర్పాటుతో ప్రస్తుతం రైల్వే లైన వస్తోందని, ఈ ప్రాంతం రూపురేఖలే మారి పోయాయ న్నారు. ఇంకా పరిశ్రమంలు వచ్చి ఈ ప్రాం తం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారం లోకి రావాలన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఇనకమ్‌ ట్యాక్స్‌ లేని వైసీపీ నాయకులు నేడు రూ. వేలకోట్లకు అధిపతులు ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఇద్దరు మం త్రులు వచ్చినా ఈప్రాంతం అభివృద్ధి జరగలేదన్నారు. దళితులంటే వైసీపీకి చిన్నచూపన్నారు. దళితులను ఇంటిలోకి అనుమతించని మంత్రి ఉషశ్రీచరణ్‌కు ఓటు ఎలా వేస్తారన్నారు. ల్యాండ్‌, లిక్కర్‌, శ్యాండ్‌ మాఫియా మాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దన్నారు. సైకిల్‌ గురు ్తకు ఓటు వేసి తనను, బీకే పార్థసారథిని గెలిపించాలని కోరారు. టీడీపీ మండల కన్వీనర్‌ సోముశేఖర్‌, నిమ్మల యువ శేఖర్‌, నిమ్మల చంద్రశేఖర్‌, అశ్వత్థరెడ్డి, బెల్లాచంద్ర, మనోహర్‌, మూర్తి, ప్రకాష్‌, కట్టుబడి ఆంజి, సుబహాన, ప్రసాద్‌, నరసింహమూర్తి, చంద్రశేఖర్‌, అమ్మిబాయి, రాజేష్‌నాయక్‌, కోగిర శ్రీని వాసులు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


జిల్లాకు వచ్చే అర్హత జగనకు లేదు

పెనుకొండ టౌన : ఉమ్మడి అనంతపురం జిల్లాకు సీఎం జగన ఏం మొహం పెట్టుకుని వచ్చారని కూటమి ఎమ్మెల్యేఅభ్యర్థి సవిత ప్రశ్నించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ప్రజల వద్దకు వెళ్లడానికి అర్హత లేదన్నారు. ఆమె శనివారం పెనుకొండ నియోజకవర్గం లో పలు పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. సవిత మీడియాతో మాట్లాడుతూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు అడగడానికి, వైసీపీ ఏం అభివృద్ధి చేసిందని సభలు పెడుతున్నారని అన్నారు. ఈ జగన రాయలసీమ ద్రోహి అని 2019లో జగన ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారో ఇప్పుడు... ఈ ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి పనులైనా చేశారా అంటూ ప్రశ్నించారు. జిల్లాకు పరిశ్రమలు తెచ్చారా, రిజర్వాయర్‌ లు నిర్మించారా, ఉద్యోగ, ఉపాధి కల్పించారా, రైతులకు నీరందించారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఇవన్నీ చేయకపోగా అన్ని వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి సీఎం జగన అన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రచారాని కి వెళ్తుంటే ఓ పక్క కియ, దాని అనుబంధ పరిశ్రమ నాసెన, బెల్‌ తదితర వాటికి వెళ్లి ఉపాధి పొందుతు న్నామని ప్రజలు అంటున్నారన్నారు. ఈ వైసీపీ పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి లేదని ఏ గడపకు వెళ్లినా చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.


టీడీపీలోకి పలువురి చేరిక

నియోజకవర్గంలోని పలు కుటుంబాలు శనివారం వైసీపీని వీడి టీడీపీలో చేరా యి. ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పట్టణంలోని తన నివా సం వద్ద వారికి పార్టీ కండువాలువేసి సాదరంగా ఆహ్వా నించారు. రొద్దం మండలం సానిపల్లికి చెందిన హనుమంతరాయుడు, సంజీవరాయుడు, ప్రభు, పరమేష్‌, సోమందేపల్లి పట్టణానికి చెందిన సురేంద్ర తదితరులు టీడీపీ చేరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 04 , 2024 | 11:21 PM

Advertising
Advertising