ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chili farmers : మిరపసాగుకు సన్నద్ధం

ABN, Publish Date - Jun 13 , 2024 | 11:20 PM

ఈసారి ఖరీఫ్‌ ప్రారంభం నుంచే వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండడంతో మిరప రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది మిరప రైతును నల్లి పురుగు, కాలర్‌ రాట్‌ వంటి తెగుళ్లు భయపెట్టి నష్టాలు పాలు చేశాయి. గత నష్టాలు కుంగదీస్తున్నా రైతులు మరోసారి మిరపను సాగు చేసే సాహసానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ సాగునీరు అందించి రైతులను ఆదుకుంటాడనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. జూన చివరి వారం, జూలై మొదటి వారంలో మిరప సాగు మొదలవుతుంది. గత ఏడాది మొదట్లో వర్షాలు బాగానే వచ్చాయి. కాపు పట్టే ...

గత ఏడాది నష్టాలను లెక్క చేయని రైతులు

మిరప విత్తనాలు కోసం పరుగులు

విడపనకల్లులో పదుల సంఖ్యలో వెలసిన విత్తన విక్రయ దుకాణాలు

విడపనకల్లు, జూన 13: ఈసారి ఖరీఫ్‌ ప్రారంభం నుంచే వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండడంతో మిరప రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది మిరప రైతును నల్లి పురుగు, కాలర్‌ రాట్‌ వంటి తెగుళ్లు భయపెట్టి నష్టాలు పాలు చేశాయి. గత నష్టాలు కుంగదీస్తున్నా రైతులు మరోసారి మిరపను సాగు చేసే సాహసానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ సాగునీరు అందించి రైతులను ఆదుకుంటాడనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. జూన చివరి వారం, జూలై మొదటి వారంలో మిరప సాగు మొదలవుతుంది. గత ఏడాది మొదట్లో వర్షాలు బాగానే వచ్చాయి. కాపు పట్టే


సమయంలో వర్షాలు రాక నల్లిపురుగు సోకింది. దీనికి తోడు కాలర్‌ రాట్‌ దెబ్బతీసింది. దీంతో వేలాది ఎకరాల్లో పంట కుళ్లిపోయి ఎండిపోయింది. కొంత మంది రైతులు పంటను తొలగించకుండా చివరి వరకూ మందులు వాడి కాపాడుకున్నారు. చివరి దశలో కాలువ నీళ్లు బంద్‌ కావటంతో వేల ఎకరాల్లో పంట నష్టపోయారు. దిగుబడి అంతంత మాత్రమే వచ్చినా సరైన ధరలు లేక కర్ణాటకలోని ఏసీ గోడౌన్లలో నిలువ చేశారు. గత ఏడాది ఉరవకొండ నియోజక వర్గంలో సుమారు 65వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది 50వేల ఎకరాల దాకా సాగు చేయవచ్చని ఉద్యానశాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. మిరప విత్తనాల కోసం విడపనకల్లు మండల కేంద్రానికి రాయదుర్గం, కళ్యాణదుర్గం, బళ్లారి, గుంతకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, బొమ్మనహాలు, కర్నూలు జిల్లా హాలర్వి, చిప్పగిరి, ప్రాంతాల నుంచి రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఒక క్వింటా డబ్బి రకం విత్తనం రూ. 34 వేలు, కడ్డీ రకం విత్తనం రూ.18వేలు ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ఏ రకం విత్తనం అయినా ఎకరానికి గొర్రుతో వేస్తే 5 నుంచి 6 కిలోలు, అదే కూలీల చేత వేయిస్తే 3 నుంచి 4 కిలోల విత్తనం కావాల్సి


ఉంటుంది. నారు వేసి పంటలు ప్రారంభించే సరికి ఎకరాకు దాదాపుగా రూ. 20 వేలకు పైగా ఖర్చులు వస్తాయి. నారు పేరిగే కొద్ది పెట్టుబడులు పెరుగుతూ పోతాయి. విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లో రైతులు ఎక్కువగా డబ్బి రకం సాగుకు మొగ్గు చూపుతారు. బొమ్మనహాలు, కణేకల్లు, కళ్యాణదుర్గం, కర్ణాటక రైతులు ఎక్కువగా కడ్డి రకం, 5531, తేజ రకం, కారం కాయలు సాగుకు మొగ్గు చూపుతున్నారు. విడపనకల్లు మండలంలో మిరప రకాన్ని బట్టి దిగుబడులు సింజెంటా బ్యాడిగి రకం ఎకరాకు 22 నుంచి 26 క్వింటాళ్లు, గుంటూరు నాటీ వెరైటీ ఎల్‌సీ రకం 28 నుంచి 31 క్వింటాళ్లు, బీఎ్‌సఎఫ్‌ ఆర్మూర్‌ రకం 30 నుంచి 40 క్వింటాళ్లు, డబ్బి రకం ఎకరాకు 25 నుంచి 30క్వింటాళ్లు, గుంటూరు కారం కడ్డీ రకం 20 నుంచి 25 క్వింటాల్లు దిగుబడులు వస్తాయి.

జీబీసీ, హంద్రీనీవా జీవనాధారం

విడపనకల్లు మండలానికి జీవనాధారమై జీబీసీ (గంతకల్లు బ్రాంచ కెనాల్‌), హెచఎల్‌సీ, బోరుబావుల కింద ఉరవకొండ నియోజక వర్గం రైతులు వేల ఎకరాల్లో మిరప పంటను వాణిజ్య పంటగా సాగు చేస్తుంటారు. కౌలు రైతులు ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ.50వేలు కౌలు చెల్లించి మిరప సాగు చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై జూన నెల వచ్చిందంటే మిరప రైతులకు పండుగ వాతావరణం ఉంటుంది. ఏ రకం విత్తనం వేయాలి, ధరలు ఎలా ఉంటాయంటూ చర్చించుకుంటూ సాగుకు సిద్ధమవుతుంటారు.

విక్రయాలు తగ్గిపోయాయి

గత ఏడాది ప్రతి రోజు 100 నుంచి 150 క్వింటాళ్ల విత్తన కాయలు విక్రయించే వాళ్లం. ప్రస్తుతం మే నెల నుంచి వ్యాపారం చేస్తున్నాం. రోజుకు కనీసం 100 క్వింటాళ్ల విత్తనం కూడా అమ్ముడుపోవటం లేదు. మిషనకు వేయటం ద్వారా మిరప పొట్టును తీసుకుని విత్తనాన్ని వేసి ఇస్తున్నాం. మిరప పొట్టు వ్యాపారులకు లాభాలు లేకుండా విక్రయించాల్సి వస్తోంది.

- ఈశ్వర్‌, వ్యాపారి, విడపనకల్లు


విడపనకల్లులోనే విత్తనం తీసుకుంటా

నేను గత సంవత్సరం నాలుగు ఎకరాల్లో మిరప పంటను సాగు చేశాను. ఈ ఏడాది ఒక్క ఎకరం మాత్రమే సాగు చేస్తున్నా. విడపనకల్లులో విత్తనం బాగుంటుందని ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నా. ప్రతి ఏటా రాయదుర్గం మండలం నుంచి వందల మంది రైతులు విడపనకల్లుకు వచ్చి విత్తనం కొనుగోలు చేసి తీసుకు వెళ్తున్నాం.

- అంజినప్ప, రైతు, పూలుకుంట, రాయదుర్గం మండలం

అప్పులు తీరాలంటే మిరప సాగు చేయాల్సిందే

నేను ప్రతి ఏటా 10 ఎకరాలు మిరప సాగు చేస్తున్నా. గత ఏడాది మిరప పంట పూర్తిగా దెబ్బతిని రూ.లక్షల్లో నష్టం వచ్చింది. ఈసారి రెండున్నర ఎకరాల్లో మాత్రమే మిరప సాగు చేసి అప్పులు తీర్చుకోవాలనుకుంటున్నాను. దేవుడు కరుణిస్తే కనీసం ఎకరాకు 20 క్వింటాళ్లు దిగుబడి వచ్చి మంచి ధరలు పలికితే కొంత ఊరట కలుగుతుంది. దేవుడిపై భారం వేసి ఈసారైనా అప్పులు తీర్చుకోవాలని మిరప సాగుకు సాహసం చేస్తున్నా.

-బొమ్మన్న, రైతు, పూలకుంట, రాయదుర్గం మండలం

వర్షాలు లేక నష్టపోయా

గత ఏడాది వర్షాలు లేక నష్టాలు పాలయ్యాను ఈ ఏడాది రెండు ఎకరాల్లో మిరప సాగు చేయాలని విడపనకల్లుకు వచ్చాను. విత్తనం కూడా పెద్ద ధరలు లేవు. కానీ లాభాలు రావాలంటే దిగుబడి అధికంగా వచ్చి ధరలు పలికితే గత ఏడాది చేసిన అప్పులు తీర్చుకోవచ్చు. అందుకే కొద్దిగానే పంటను సాగు చేస్తున్నా. ప్రతి ఏటా అప్పులపాలవుతున్నాను.

- భీమన్న, రైతు, రంగసముద్రం, రాయదుర్గం మండలం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 13 , 2024 | 11:20 PM

Advertising
Advertising