ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

FORMER : విత్తుకు సిద్ధం

ABN, Publish Date - Jul 14 , 2024 | 11:53 PM

ప్రకృతి సహకరిస్తున్న గ్యారెంటీ లేదు. పంట పండుతుందో? లేక ఎండుతుందో తెలియదు. ధర ఉంటుందో పంట చేతికి రాగానే పడిపోతుందో అంచనా లేదు. కానీ అతను రైతు కదా..! మొండి ధైర్యం ఆయన సొంతం. అందుకే ఖరీఫ్‌లో ఓ మోస్తరుగా వర్షాలు కురిసినా వందల ఎకరాల్లో పంటలు సాగు చేశాడు. మరి కొందరు మళ్లీ వర్షం కురిస్తే సాగు చేయడానికి పొలాలు సిద్ధం చేసుకున్నారు. మండలంలో రెండు, మూడు సార్లు ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇంతకాలం బీళ్లుగా ...

A farmer engaged in agricultural work

సర్వం సిద్ధం చేసుకున్న అన్నదాతలు..

చినుకు కోసం ఎదురుచూపులు

గార్లదిన్నె, జూలై 14: ప్రకృతి సహకరిస్తున్న గ్యారెంటీ లేదు. పంట పండుతుందో? లేక ఎండుతుందో తెలియదు. ధర ఉంటుందో పంట చేతికి రాగానే పడిపోతుందో అంచనా లేదు. కానీ అతను రైతు కదా..! మొండి ధైర్యం ఆయన సొంతం. అందుకే ఖరీఫ్‌లో ఓ మోస్తరుగా వర్షాలు కురిసినా వందల ఎకరాల్లో పంటలు సాగు చేశాడు. మరి కొందరు మళ్లీ వర్షం కురిస్తే సాగు చేయడానికి పొలాలు సిద్ధం చేసుకున్నారు. మండలంలో రెండు, మూడు సార్లు ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇంతకాలం బీళ్లుగా వదిలేసిన భూములను దుక్కిచేసి, విత్తనం వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. వరుస పంట నష్టాలతో అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతలకు ఈ ఏడాది పంట సాగుకు రైతిలో చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఇన్‌పుట్‌సబ్సిడీ


అంతంత మాత్రమే అందింది. ఇలాంటి తరుణంలో అప్పులు చేసి పంటలు సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 600 ఎకరాలు వేరుశనగ, 700 ఎకరాలు కంది, 1500 ఎకరాలు ఆముదం పంటలు సాగుచేశారు. వర్షం కురిస్తే సుమారు 4800 ఎకరాల్లో వేరుశనగ, దాదాపు 1800 ఎకరాల్లో కంది సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు, మందులు రైతులు సిద్ధంగా ఉంచుకున్నారు.

పెరిగిన ఖర్చులు....

గతంలో పోలిస్తే ఈ సారి పంట సాగు ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఎకరా పొలం దుక్కి చేసేందుకు, విత్తనాలు కొనుగోలు చేసి విత్తు వేసే ఎరువులు, పురుగు మందులతో పాటు పంట నూర్పిడి చేసే వరకు ఎకరాకు సుమారు రూ. 30వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే పురుగు మందులు ధరలు భారీగా పెరిగాయి. మంచి దిగుబడులు సాధించాలంటే ఎరువుల వినియోగం తప్పనిసరి అయింది. విత్తనాలు, ఎరువులతో పాటు క్రిమిసంహారక మందులకు వేలాది రూపాయలు వెచ్చించాలంటే అన్నదాతలు బెంబేలెత్తిపోతున్నారు.

వర్షం వస్తే విత్తనం వేస్తాం

నాకు ఎనిమిదెకరాల పొలం ఉంది. ఇటీవల కురిసిన అరకొర వర్షానికి కొంత పొలంలో కంది పంట సాగుచేశా. వర్షం కురిస్తే వేరుశనగ విత్తనం సాగు చేసేందుకు విత్తనాలు, ఎరువులు, మందులు సిద్ధం చేసుకున్నాం. -పెద్దతాతయ్య, మర్తాడు

విత్తేందుకు సిద్ధంగా ఉన్నాం

నాకున్న నాలుగెకరాల పొలంలో ప్రతి ఏటా వేరుశనగ సాగుచేస్తాం. ఇప్పటికే గ్రామంలో కొంతమంది రైతులు ఆరకొర పదునుకే విత్తు విత్తారు. ప్రతి ఏడాది దిగుబడులు అంతంత మాత్రమే వస్తున్నాయి. ఈ ఏడాది దిగుబడులు బాగా వస్తాయని ఆశిస్తున్నాం. వర్షం కురిస్తే వేరుశనగ సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నా.

-రామసుబ్బారెడ్డి, కోటంక

వర్షం వచ్చేదే ఆలస్యం

నాకున్న నాలుగెకరాలలో ప్రతి ఏడాది వేరుశనగ పంట సాగుచేస్తున్నాం. సాగుచేసిన ప్రతి సారీ నష్టాలే చవిచూస్తున్నాం. ఈ ఏడాది వేరుశనగ సాగుచేసేందుకు అవసరమైన విత్తనాలు సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా ఎరువులు, మందులు కొనుగోలు చేసుకున్నాం. వర్షం వస్తే వేరుశనగ సాగుచేస్తాం.

- బోయ సుబ్బులు, కోటంక


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 14 , 2024 | 11:53 PM

Advertising
Advertising
<