మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

GAMES : క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం

ABN, Publish Date - May 28 , 2024 | 12:03 AM

క్రీడలతో మానసిక ఒత్తిడి దూ రం అవుతుందని వక్తలు పేర్కొన్నారు. హిందూపురం ఎస్‌డీజీఎస్‌ కళాశాల క్రీడా మైదానంలో సోమవారం హిందూపురం యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆధ్వ ర్యంలో ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన గ్రాస్‌రూట్‌ బ్లూ నేతృత్వంలో అం డర్‌-10, అండర్‌-13 ఫుట్‌బాల్‌ చాంపియనషిప్‌ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.

GAMES : క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం
Under-13 winners receiving prizes

‘క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం’

హిందూపురం అర్బన, మే 27: క్రీడలతో మానసిక ఒత్తిడి దూ రం అవుతుందని వక్తలు పేర్కొన్నారు. హిందూపురం ఎస్‌డీజీఎస్‌ కళాశాల క్రీడా మైదానంలో సోమవారం హిందూపురం యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆధ్వ ర్యంలో ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన గ్రాస్‌రూట్‌ బ్లూ నేతృత్వంలో అం డర్‌-10, అండర్‌-13 ఫుట్‌బాల్‌ చాంపియనషిప్‌ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్‌-10 విభాగంలో బత్తలపల్లి మొదటి స్థానంలో నిలువగా.. హిందూపురం టౌన ద్వితీయ, హిందూపురం యునైటెడ్‌ తృతీయస్థానంలో నిలిచాయి. అండర్‌-13 విభాగంలో హిందూపురం యునైటెడ్‌ ప్రథమస్థానం, కదిరి ద్వితీయ, ధర్మవరం తృతీయ స్థానంలో నిలిచాయి. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇర్షాద్‌, కార్యదర్శి మొహ్మద్‌ సలీం, శోశాధికారి శేఖర్‌, ఈసీ మెంబరు విజయవాణి, పీడీలు లోకనాథ్‌, సురేష్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 28 , 2024 | 12:03 AM

Advertising
Advertising