ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DOCTORS : డాక్టర్లను కాపాడండి

ABN, Publish Date - Aug 18 , 2024 | 12:53 AM

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రరాజధాని కోల్‌కతా లో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలంటూ ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు, వైద్య సిబ్బంది ధర్మవరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆల్‌ఇండియా మెడికల్‌ అసోసియేషన పిలుపు మేరకు శనివారం పట్టణంలోని ప్రభుత్వ, ఫ్రైవేటు ఆసుప త్రుల డాక్టర్లు, వైద్యసిబ్బంది వైద్య సేవలను బంద్‌చేసి, ధర్మవరం ప్రభుత్వాసుపత్రి నుంచి ఫ్లకార్డులు పట్టుకుని కళాజ్యోతిసర్కిల్‌, కాలేజ్‌సర్కిల్‌ మీదుగా ర్యాలీ సాగించారు. వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి, డాక్టర్లును కాపా డండి మిమ్మల్ని మేము కాపాడుతాం అంటూ నినాదాలు చేశారు.

ధర్మవరంలో ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది

బాధ్యులను కఠినంగా శిక్షించాలి

వైద్యులు, సిబ్బంది డిమాండ్‌

వైద్య సేవలు బంద్‌ చేసి భారీ ర్యాలీ

ధర్మవరంరూరల్‌, ఆగస్టు17: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రరాజధాని కోల్‌కతా లో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలంటూ ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు, వైద్య సిబ్బంది ధర్మవరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆల్‌ఇండియా మెడికల్‌ అసోసియేషన పిలుపు మేరకు శనివారం పట్టణంలోని ప్రభుత్వ, ఫ్రైవేటు ఆసుప త్రుల డాక్టర్లు, వైద్యసిబ్బంది వైద్య సేవలను బంద్‌చేసి, ధర్మవరం ప్రభుత్వాసుపత్రి నుంచి ఫ్లకార్డులు పట్టుకుని కళాజ్యోతిసర్కిల్‌, కాలేజ్‌సర్కిల్‌ మీదుగా ర్యాలీ సాగించారు. వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి, డాక్టర్లును కాపా డండి మిమ్మల్ని మేము కాపాడుతాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మెడికల్‌ అసోసియేషన ధర్మవరం శాఖ అధ్యక్షుడు జయకు మార్‌, తదితరులు మాట్లాడుతూ...


వైద్యురాలి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన కార్యదర్శి డాక్టర్‌ వాసుదేవరెడ్డి, కోశాధికారి మదనమోహన, మాజీ అధ్యక్షు డు ప్రసాద్‌రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మాధవి, డిప్యూటీ డీఎంహెచఓ సెల్వియాసాల్మన, డాక్టర్లు నజీర్‌, వెంకటేశులు, వైష్ణవి, అనిల్‌, వివేక్‌, విక్రమ్‌, అజయ్‌బాబు, సిస్టర్‌ నిర్మల, వెంకటరమణ, రామ్మోహన తదితరులు పాల్గొన్నారు.

కదిరి అర్బన: కోలకత్తలో ఘటనకు నిరసనగా శనివారం ఐఎంఏ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఏరియా ఆసుపత్రినుంచి టవర్‌క్లాక్‌, ఎంజీరోడ్డు, జీవిమానసర్కిల్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌ మీదుగా ర్యాలీ కొనసాగింది. దుండగులను కఠినంగా శిక్షించాల న్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నాయకులు, ఆర్‌ఎంపీల అసోసియేషన నాయకులు, పట్టణంలోని ప్రైవేటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

తనకల్లు: కోల్‌కతా ఘటనకు నిరసనగా శనివారం మండలపరిధిలోని కొక్కంటి క్రాస్‌లోప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కొక్కంటి వైద్యాధికారి లోకేశ్వర్‌రెడ్డి, ధర్మరాజు ఆధ్వర్యంలో వైద్య ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి, నాలుగురోడ్ల కూడలిలో మానవహారం ఏర్పాటుచేశారు. నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈకార్యక్రమంలో కొక్కంటి సీహెచసీ సిబ్బంది, ఆశాకార్యకర్తలు, ల్యాబ్‌ టెక్నిషియన్లు, ఆర్‌ఎంపీలు పాల్గొన్నారు.

పుట్టపర్తిరూరల్‌ : కోల్‌కతా ఘటనపై జిల్లాకేంద్రంలోని సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు ఓపీ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాం డ్‌ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుని వైద్యల్లో మనోధైర్యాన్ని నింపాలన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 18 , 2024 | 12:53 AM

Advertising
Advertising
<