WATER : రోడ్డుపై మురుగునీటి ప్రవాహం
ABN, Publish Date - May 07 , 2024 | 12:31 AM
మండలకేంద్రంలోని వైఎస్‌ఆర్ సర్కిల్‌లో రోడ్డుపై మురుగునీరు యథేచ్ఛగా ప్రవహిస్తోంది. అయినా ప్రజాప్రతినిధులుకానీ, అధికారులుకానీ పట్టించు కున్న పాపానపోలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రొద్దం ప్రధాన వీధుల్లో సరైన డ్రైనేజీ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో రోడ్డుపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామ స్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధిలేక ఆ మురుగునీటిలోనే నడుస్తూ అసహ నం వ్యక్తం చేస్తున్నారు.
రొద్దం, మే 6 : మండలకేంద్రంలోని వైఎస్‌ఆర్ సర్కిల్‌లో రోడ్డుపై మురుగునీరు యథేచ్ఛగా ప్రవహిస్తోంది. అయినా ప్రజాప్రతినిధులుకానీ, అధికారులుకానీ పట్టించు కున్న పాపానపోలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రొద్దం ప్రధాన వీధుల్లో సరైన డ్రైనేజీ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో రోడ్డుపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామ స్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విధిలేక ఆ మురుగునీటిలోనే నడుస్తూ అసహ నం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ఆర్ సర్కిల్ సమీపంలో పెనుకొండ- పావగడ ప్రధాన రహదారిపై నిత్యం మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తున్నా అటుగా వెళ్లే ప్రజాప్రతి నిధులు, అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడి పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీరు డ్రైనేజీలోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అభివృద్ధి అంటే ఇదేనా?: టీడీపీ నాయకులు
రొద్దంమండలకేంద్రంలోని పాత ఎస్సీ కాలనీలో ఇళ్ల దగ్గర డ్రైనేజీని శుభ్రం చేయకపోవడంతో చెత్తా చెదారంతో నిండి పోయి కంపు కొడుతోంది. అయినా పట్టించుకున్న నాథులు కరువయ్యారని, అభివృద్ధి అంటే ఇదేనా అని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. టీ డీపీ నాయకులు మంగళవారం రొద్దం హరిజనవాడలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో అడుగడుగునా డ్రైనేజీ సమస్యను వారు గమనించారు. మురుగుకాలువలో చెత్తాచెదారం పైరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీ వాసులంటే వైసీపీవారికి అంత అలుసుగా ఉందా అని ప్రశ్నించారు. ఏడాది నుంచి డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని పట్టించుకునే వారే లేరని మండిపడ్డారు. నాయకులు చిన్నప్పయ్య, నర సింహులు, హరీష్, వీరాంజనేయులు, వాల్మీకి చంద్రశేఖర్, సిద్దన్న, నాగేంద్ర, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 07 , 2024 | 12:31 AM