Doctors : అరాచకాలను అరికట్టండి
ABN, Publish Date - Aug 18 , 2024 | 12:52 AM
కోల్‌కతా మెడికల్ కాలేజీలో పీజీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ జూడాలు ఆందోళనకు దిగారు. దోషులను కఠినంగా శిక్షించాలని, డాక్టర్ల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ శనివారం విధులను బహిష్కరించారు. జిల్లా సర్వజన వైద్యశాల నుంచి సప్తగిరి సర్కిల్, క్లాక్ టవర్ మీదరుగా భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి ఆందోళనకు ఐఎంఏ, ప్రభుత్వ వైద్యుల సంఘం, నర్శింగ్ హోమ్స్ అసోషియేషన, మెడికల్ రెప్స్, ఏపీజేఏసీ అమరావతి జిల్లా విభాగం, ఐద్వా, ఏడీఎ్‌సఓ, జాతీయ మానవ హక్కుల వేదిక తదితరుల ...
నగరంలో నినదించిన జూడాలు
కోల్‌కతా హత్యాచార ఘటనపై ఆగ్రహం
అనంతపురం టౌన, ఆగస్టు 16:
కోల్‌కతా మెడికల్ కాలేజీలో పీజీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ జూడాలు ఆందోళనకు దిగారు. దోషులను కఠినంగా శిక్షించాలని, డాక్టర్ల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ శనివారం విధులను బహిష్కరించారు. జిల్లా సర్వజన వైద్యశాల నుంచి సప్తగిరి సర్కిల్, క్లాక్ టవర్ మీదరుగా భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి ఆందోళనకు ఐఎంఏ, ప్రభుత్వ వైద్యుల సంఘం, నర్శింగ్ హోమ్స్ అసోషియేషన, మెడికల్ రెప్స్, ఏపీజేఏసీ అమరావతి జిల్లా విభాగం, ఐద్వా, ఏడీఎ్‌సఓ, జాతీయ మానవ హక్కుల వేదిక తదితరుల సంఘాలు సంఘీభావం తెలిపాయి. న్యాయం కావాలని నినదించారు. మహిళా వైద్యురాలి హత్యాచారం పట్ల పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. దోషులను పట్టుకుని ఉరి
తీయాలని డిమాండ్ చేశారు. వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జూడాల సంఘం నాయకులు సమరసింహారెడ్డి, రాఘవేంద్ర, హరినాథ్‌రెడ్డి, ఐఎంఏ నాయకులు డాక్టర్ హేమలత, డాక్టర్ మనోరంజనరెడ్డి, అభిషేక్ రెడ్డి, అక్బర్ సాబ్ ప్రభుత్వ వైద్యులు రామస్వామినాయక్, వాల్మీకి శ్రీనివాస్, వైవీ ప్రసాద్, శ్రీదేవి, షంషాద్‌బేగం, రేణుక, షబానా, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ వైద్యులు, పీజీలు విధులను బహిష్కరించడంతో జిల్లా ఆస్పత్రిలో రోగులకు ఇబ్బంది లేకుండా వైద్యాధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యాలరావు పర్యవేక్షించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 18 , 2024 | 12:52 AM