WELFARE ASSISTANT : పింఛన్ల సొమ్ము స్వాహా
ABN, Publish Date - Jul 03 , 2024 | 12:11 AM
శెట్టూరు మండల కేంద్రంలోని సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున పింఛన్ల సొమ్ము పంపిణీ చేయకుండా చేతివాటం ప్రదర్శించాడు. లబ్ధిదారులతో సోమవారం వేలిముద్రలు వేయించుకుని.. సొమ్ము ఇవ్వకుండా వెళ్లిపోయాడు. మొత్తం రూ.8 లక్షల వరకూ కాజేశాడని బాధితులు ఎంపీడీఓ నరసింహమూర్తికి మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో వెల్ఫేర్ అసిస్టెంట్‌పై స్థానిక పోలీస్ స్టేషనలో ఎంపీడీఓ ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ కూటమి మంజూరు ...
వెల్ఫేర్ అసిస్టెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు
కళ్యాణదుర్గం(శెట్టూరు), జూలై 2: శెట్టూరు మండల కేంద్రంలోని సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున పింఛన్ల సొమ్ము పంపిణీ చేయకుండా చేతివాటం ప్రదర్శించాడు. లబ్ధిదారులతో సోమవారం వేలిముద్రలు వేయించుకుని.. సొమ్ము ఇవ్వకుండా వెళ్లిపోయాడు. మొత్తం రూ.8 లక్షల వరకూ కాజేశాడని బాధితులు ఎంపీడీఓ నరసింహమూర్తికి మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో వెల్ఫేర్ అసిస్టెంట్‌పై స్థానిక పోలీస్ స్టేషనలో ఎంపీడీఓ ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ కూటమి మంజూరు చేసిన కొత్త పింఛన్లను పంపిణీ చేసేందుకు బ్యాంకు నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్
శనివారం రూ.42 లక్షలు డ్రా చేశాడు. అదే రోజు సచివాలయంలో పనిచేసే తొమ్మిది మంది ఉద్యోగులకు రూ.3 లక్షలు.. రూ.5 లక్షలు చొప్పున అందజేసి, పింఛన్లు పంపిణీ చేయమని సూచించాడు. తక్కువ వస్తే తనను అడగాలని చెప్పి వెళ్లిపోయాడు. తన వంతుగా పంపిణీ చేయాల్సిన సొమ్మును మాత్రం స్వాహా చేశాడు. సుమారు 50 మంది లబ్ధిదారుల వేలిముద్రలు వేయించుకుని, డబ్బులు తరువాత ఇస్తానని చెప్పినట్లు బాధితులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలోనూ మల్లికార్జున పింఛన్లను స్వాహా చేశాడని, అప్పట్లో వైసీపీ నాయకులు దుప్పటి పంచాయితీ చేసి అతన్ని కాపాడారని ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 03 , 2024 | 12:11 AM