ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PARITALA SUNITA : సామాజిక పింఛన్లను తెచ్చిందే టీడీపీ

ABN, Publish Date - Jun 30 , 2024 | 12:46 AM

సామాజిక భద్రత పింఛన్లను తీసుకువచ్చిందే టీడీపీ అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. వెంకటాపురంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లను అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్‌ హయాంలో నెలకు రూ.35 చొప్పున పింఛన అందించడం ప్రారంభించారని, దానిని ఈ రోజు రూ.4 వేలకు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందనని అన్నారు. రూ.35 ఉన్న పింఛనను రూ.75కు పెంచింది చంద్రబాబేనని, 2004లో వైఎస్సార్‌ రూ.200 ఇస్తానని రూ.25 మాత్రమే పెంచారని గుర్తు చేశారు. 2014 జూన 8న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా

MLA Paritalasunitha talking to reporters

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

రామగిరి, జూన 29: సామాజిక భద్రత పింఛన్లను తీసుకువచ్చిందే టీడీపీ అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. వెంకటాపురంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లను అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్‌ హయాంలో నెలకు రూ.35 చొప్పున పింఛన అందించడం ప్రారంభించారని, దానిని ఈ రోజు రూ.4 వేలకు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందనని అన్నారు. రూ.35 ఉన్న పింఛనను రూ.75కు పెంచింది చంద్రబాబేనని, 2004లో వైఎస్సార్‌ రూ.200 ఇస్తానని రూ.25 మాత్రమే పెంచారని గుర్తు చేశారు. 2014 జూన 8న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా


ప్రమాణస్వీకారం చేసిన రోజే పింఛనను రూ.1000కిపెంచారని అన్నారు. ఆ తరువాత రూ.2 వేలు చేసింది కూడా చంద్రబాబే అని అన్నారు. ఐదేళ్లలో పదిరెట్లు పెంచి రికార్డు సృష్టించారని అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, చేనేతలు, మత్స్యకారులకు పింఛన ఇచ్చింది చంద్రబాబే అని అన్నారు. 2014 నాటికి రాష్ట్రంలో 39,27,521 పింఛనలు ఉండగా 2019 మార్చి నాటికి 54.25 లక్షలకు చేరాయని అన్నారు. జగన రూ.3వేలు పింఛన ఇస్తానని చెప్పి ఏడాదికి రూ.250 మాత్రమే పెంచారనని, తాము ఎన్నికలలో చెప్పినట్టు ఏప్రిల్‌ నుంచే పింఛన పెంపు వర్తింపజేస్తున్నామని అన్నారు. జూలైలో పెంపు బకాయితో కలిపి ఒక్కొక్కరికి రూ.7వేలు ఇస్తామని అన్నారు. జూలై 1న రాప్తాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సచివాలయ ఉద్యోగి ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పింఛన పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొనాలని అన్నారు.


పింఛన్ల పంపిణీపై నిర్లక్ష్యం వద్దు

కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌

అనంతపురం టౌన, జూన 29: ఎన్టీఆర్‌ భరోసా పింఛనల పంపిణీలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. ఒకటో తేదీనే వందశాతం పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డీఆర్‌డీఏ, సచివాలయ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. పింఛన్ల పంపిణీకి ఇప్పటికే సిబ్బందిని నియమించామని, లబ్ధిదారులను వారికి కేటాయించామని తెలిపారు. ఆ రోజు ఉదయం 6 గంటలకే పంపిణీని ప్రారంభిస్తే వందశాతం సులభంగా సాధించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి సొమ్ము అందించాలని సూచించారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే డ్రా చేసిన సొమ్మును పంపిణీ చేసే సిబ్బందికి అందజేయాలని సూచించారు. జిల్లా, మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షించాలని అన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వైఖోమ్‌ నిదియ, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, డీపీఓ ప్రభాకర రావు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 30 , 2024 | 12:46 AM

Advertising
Advertising