FOREST DEPT : పదేళ్ల పనిమంతుడు..!
ABN, Publish Date - Jul 03 , 2024 | 12:14 AM
అటవీశాఖ జిల్లా కార్యాలయంలో పదేళ్లుగా ఓ అధికారి పాతుకుపోయారు. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి అండతో వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ దందా నడిపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ముడుపు కడితేగానీ ఫైల్ ముందుకు కదలదని, చెదలు పట్టినా అలాగే ఉండిపోతుందని విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగోన్నతులు, ఇంక్రిమెంట్లు.. ఇలా ఏదైనా సరే.. ఆయనకు ఇవ్వాల్సింది ఇచ్చేయాల్సిందేనట. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక బాధితులు లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ...
పైసలివ్వనిదే ఫైల్ ముట్టుకోడు
అటవీశాఖలో ఓ అధికారి దందా
అనంతపురం న్యూటౌన, జూలై 2: అటవీశాఖ జిల్లా కార్యాలయంలో పదేళ్లుగా ఓ అధికారి పాతుకుపోయారు. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి అండతో వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ దందా నడిపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ముడుపు కడితేగానీ ఫైల్ ముందుకు కదలదని, చెదలు పట్టినా అలాగే ఉండిపోతుందని విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగోన్నతులు, ఇంక్రిమెంట్లు.. ఇలా ఏదైనా సరే.. ఆయనకు ఇవ్వాల్సింది ఇచ్చేయాల్సిందేనట. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక బాధితులు లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అటవీశాఖ జిల్లా కార్యాలయం పరిపాలన విభాగం
దుస్థితి ఇది. గుమాస్తా హోదాలో ఉన్న ఆయన.. పదేళ్లుగా ఒకే సీటుకు అతుక్కుపోయారు. పరిపాలన విభాగంలో ఆయనే కీలకం. ప్రతి ఫైల్ ఇయన వద్దకు వెల్లాల్సిందే. కార్యాలయంలో సూపరింటెండెంట్ ఉన్నా లేనట్లేనని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైల్స్ అన్నీ ఆయన టేబుల్ దాటుకునే వెళ్లాల్సి ఉన్నందున.. ఆ సీటు హాట్ కేక్‌లా తయారైందని అంటున్నారు. మరీముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అటవీశాఖ ఉద్యోగుల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల ఫైళ్లు ఆయన చేతుల్లోనే ఉంటాయని అంటున్నారు.
కదలని ఉద్యోగోన్నతుల ఫైల్
ముడుపు కట్టిన వారికి ఆయన ప్రాధాన్యం ఇస్తారని, మిగిలినవారి గురించి పట్టించుకోరని సమాచారం. ఇటీవల ఎఫ్‌ఎ్‌సఓకు డీఆర్వోలుగా ఉద్యోగోన్నతి కల్పించారు. ఖాళీ అయిన స్థానాలకు ఎఫ్‌బీఓలలో అర్హులను గుర్తించి.. ఎఫ్‌ఎ్‌సఓలుగా ఉద్యోగోన్నతి కల్పించడానికి ఫైల్స్ సిద్ధం చేసి.. ఉన్నతాధికారుల అనుమతికి పంపాలి. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఫెవికాల్ వీరుడికి ముడుపుల బేరం కుదరక.. ఫైల్ ఉన్నతాధికారులకు పంపడం లేదని అంటున్నారు. తమకు అర్హత ఉందని, ఉద్యోగోన్నతి ఎలా రాకుండా పోతుందో చూస్తామని కొందరు మొండికేయడంతో కాలయాపన జరుగుతోందని అంటున్నారు. తమకు కాదని, ముడుపులతో అడ్డదారిలో ఉద్యోగోన్నతులకు జాబితా తయారు చేస్తే ఉన్నతాధికారులను సంప్రదిస్తామని అర్హులు అంటున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 03 , 2024 | 12:15 AM