ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు చారిత్రాత్మకం

ABN, Publish Date - Mar 11 , 2024 | 12:03 AM

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీచేయడం చారిత్రాత్మకమైనదని టీడీపీ జిల్లా అధ్య క్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

బీకే పార్థసారథి

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి

పెనుకొండ, మార్చి 10 : రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీచేయడం చారిత్రాత్మకమైనదని టీడీపీ జిల్లా అధ్య క్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని పార్టీ సభ్యులుగా తామం దరం స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్టపరిస్థితుల ఆధారంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త నిర్ణయం తీసుకున్నారన్నారు. వైసీపీ నిరంకుశ పాలనకు తుదముట్టించేందుకు మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయన్నారు. సీఎం జగనరెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశను ఆర్థిక సంక్షో భంలోకి నెట్టారన్నారు. అన్నపూర్ణ అయిన రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశగా మా ర్చాన్నారు. కులంతో సంబంధంలేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జగన ప్రభుత్వంలోనే అధికమయ్యాయన్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగనరెడ్డి, విజయ్‌సాయిరెడ్డి, సజ్జలరామక్రిష్ణారెడ్డి, ధనుంజయరెడ్డిగా మారిందన్నారు. బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లులాంటిదని, మొన్న జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఇది మరోసారి రుజువైందన్నారు. చంద్ర బాబు పాలన ఆంధ్రప్రదేశకు రక్షణగా ఉంటుందని తమ నమ్మకమన్నారు. అతి పెద్ద జాతీయ పార్టీతో పాటు దేశం మొత్తం టీడీపీకి మద్దతుఇస్తుందన్నారు.

నేడు టీడీపీ నియోజకవర్గ సమావేశం

పెనుకొండ, మార్చి 10: పట్టణంలోని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థ సారథి కార్యాలయంలో సోమవారం టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పట్టణ, మండల కన్వీనర్లు సిద్దయ్య, రవిశంకర్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. బీకే ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సమావేశం నిర్వహిచనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర, జిల్లా నియోజకవర్గం, మండల, గ్రామస్థాయి నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

గోరంట్ల: పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం జరగ నున్న సమావేశానికి పార్టీశ్రేణులు తరలి రావాలని టీడీపీ మండల కన్వీనర్‌ సోముశేఖర్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారఽథి అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయంలో మధ్యాహ్నం 2గంటలకు జరిగే సమావేశానికి టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని కోరారు.

Updated Date - Mar 11 , 2024 | 12:03 AM

Advertising
Advertising