ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలి

ABN, Publish Date - Mar 01 , 2024 | 12:08 AM

మధ్యంతర భృతి(ఐఆర్‌) వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. పట్టణంలో గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

ఉరవకొండ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

ఉరవకొండ, ఫిబ్రవరి 29: మధ్యంతర భృతి(ఐఆర్‌) వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. పట్టణంలో గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ సీపీఎ్‌సను రద్దు చేసి ఓపీఎ్‌సను అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను మంజూరు చేస్తూ, గత డీఏ బకాయిలను విడుదల చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. నాయకులు భాస్కర్‌, హనుమప్ప, పాండురంగ, నరసింహులు, క్రిష్టప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.

గుత్తి: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్ధానిక తహసీల్దారు కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలు పరచాలని 30శాతం మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ నాయకులు దేశాయి నాగరాజు, చార్లెస్‌, లాలూ సాహెబ్‌, ఆదినారాయణ పాల్గొన్నారు.

తాడిపత్రిటౌన: ఐఆర్‌ 30 శాతం వెంటనే ప్రకటించాలని కోరుతూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో నాయకులు గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. ఏపీటీఎఫ్‌ పూర్వ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, జిల్లా కార్యదర్శి డేనియల్‌, రామ్‌దాస్‌, అంకాలు, ఓబయ్య, జయచంద్ర, శ్రీవాస్తవ పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:08 AM

Advertising
Advertising