MS : వైసీపీ పాలన అన్ని రంగాల్లోనూ విఫలం
ABN, Publish Date - May 12 , 2024 | 12:17 AM
వైసీపీ పాలన అన్ని రంగాల్లో విఫల మైందని.... రాష్ట్రంలో సైకో ప్రభుత్వం పోయి, చంద్ర బాబు రావాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుం డుమల తిప్పేస్వామి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. వారు శనివారం అగళి మండల కేంద్రంలో అనంతరం రామాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.... మడకశిర ప్రాంతానికి పరిశ్రమలు, సాగునీరు, తాగునీరు రావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు
అగళి, మే 11 : వైసీపీ పాలన అన్ని రంగాల్లో విఫల మైందని.... రాష్ట్రంలో సైకో ప్రభుత్వం పోయి, చంద్ర బాబు రావాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుం డుమల తిప్పేస్వామి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. వారు శనివారం అగళి మండల కేంద్రంలో అనంతరం రామాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.... మడకశిర ప్రాంతానికి పరిశ్రమలు, సాగునీరు, తాగునీరు రావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు.
వైసీపీ పాలని అన్ని రంగాల్లోనూ విఫలమైం దని ఎక్కడ చూసినా అరాచకాలు, దౌర్జన్యాలు తప్ప అభివృద్ధి లేదన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి టీడీపీ కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు, పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరా రు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉమేష్, మండల కన్వీన ర్ కుమారస్వామి, మండల క్లస్టర్ ఇన్చార్ ్జశివకుమార్, మాజీ సర్పంచ రవికుమార్, మండల మాజీ కన్వీనర్ షౌకత, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నరసింహప్ప, కమ్మర శివన్న బోయ నాగరాజు తదితర నాయకులు, కార్యకర్తలు అభిమా నులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మడకశిర రూరల్: టీడీపీ హయాంలోనే గ్రామ స్థాయి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. ఆయన శనివారం గుండుమల తిప్పేస్వామితో కలిసి మం డలంలోని గుండుమల పంచాయతీలో ఎన్నిల ప్రచా రం నిర్వహించారు. గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు. గుండుమల గ్రామం పసుపుమయమైంది. మహిళలు టీడీపీ జెండా ఎత్తుకొని నృత్యాలతో హోరెత్తించారు. నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని గౌడనహళ్లి పంచా యతీకి చెందిన వైసీపీ నాయకలు టీడీపీలో చేరారు. వారికి గుండు మల తిప్పేస్వామి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
మడకశిర టౌన: ఎన్నికలు రెండు రోజులుండగా టీడీపీలో చేరికలతో పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. గుడిబండ మండలం సీపీగిరికి చెందిన డ్రైవర్ నరసిం హమూర్తితో పాటు అనుచరుల 30కుటుంబాలు వైసీపీ ని వీడి టీడీపీలో చేరాయి. అలాగే మడకశిర మండలం జిల్లెడగుంట గ్రామానికి చెందిన మైలారప్ప, మూర్తి, గుజ్జీరప్పతో పాటు 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు, నియోజ కవర్గం సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామి ప ట్టణంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్‌మూర్తి, కార్యనిర్వహక కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 12 , 2024 | 12:17 AM