KESHAV CAMPAIN: వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
ABN, Publish Date - May 04 , 2024 | 12:20 AM
రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ విమర్శించారు. మండలంలోని రాకెట్ల, ఆమిద్యాల, మోపిడి, ఇంద్రావతి, పెద్దముష్టూరు గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి స్వగ్రామమైన రాకెట్లలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు.
రాకెట్లలో కేశవ్ రోడ్‌షోకు ప్రజల నీరాజనం
ఉరవకొండ, మే 3: రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ విమర్శించారు. మండలంలోని రాకెట్ల, ఆమిద్యాల, మోపిడి, ఇంద్రావతి, పెద్దముష్టూరు గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి స్వగ్రామమైన రాకెట్లలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. రోడ్‌షోలో భాగంగా సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. కేశవ్ మాట్లాడుతూ సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయలేని విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గాన్ని ఏమి అభివృద్ధి చేస్తారో ప్రజలు ఆలోచించాలన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో హంద్రీనీవా కాలువ ద్వారా ఒక ఎకరానికైనా అదనంగా నీటిని అందించారా అని ప్రశ్నించారు. ఆమిద్యాల లిఫ్ట్ పనులకు అతీగతీ లేదన్నారు. కేవలం కొన్ని చోట్ల మాత్రమే గుంతలు తవ్వి బిల్లులు చేసుకున్నారని విమర్శించారు.
కాలువలకు సాగునీరు ఇస్తేనే రైతుల జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. టీడీపీ హయాంలో 11 చెరువులకు నీళ్లు ఇచ్చామన్నారు. కేంద్రం నిధులు ఇస్తే జగన తన స్టిక్కర్లు వేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి లక్ష్యమన్నారు. ఐదేళ్ల పాలనలో ధరలు ఆకాశన్నంటి జనజీవనం బ్రతుకు భారమైందన్నారు. మండల కన్వీనర్ విజయ్ భాస్కర్, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ దేవినేని పురుషోత్తం, ఏఎంసీ మాజీ చైర్మన్లు రేగాటి నాగరాజు, బీసీ మారెన్న, మాజీ జడ్పీటీసీ గుర్రంసుధాకర్, మాజీ ఎంపీపీ రత్నమ్మ, నాయకులు సిసింద్రి, నెట్టెంశివ, శ్రీధర్, గోవిందు, యర్రగుంట్ల వెంకటేశులు, నెట్టెం బోస్ పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ పథకాలుపై ప్రచారం
విడపనకల్లు: మండలంలోని వివిధ గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు సూపర్ సిక్స్ పథకాలుపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో పేదలు ఏవిదంగా నష్టపోయారో వివరించారు. అబివృద్ధి చేశామంటూ 20ఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారని ఆరోపించారు. ఆయా గ్రామాల సర్పంచలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు
బెళుగుప్ప: మండలంలోని ఎర్రగుడి, బెళుగుప్ప గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు శుక్రవారం పయ్యావుల శ్రీనివాసులు సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఎర్రగుడిలో ఈశ్వరప్ప, నారాయణ స్వామి, జే తిప్పేస్వామి, యర్రిస్వామి, నాగరాజు, మర్రిస్వామి, తిప్పేస్వామిలు, బెళుగుప్పలో శివశంకర, సోము, రామిరెడ్డి, ఈశ్వరరెడ్డి, వెంకటేశులు రెడ్డి, తిప్పేస్వామి టీడీపీలో చేరగా వారికి పయ్యావుల శ్రీనివాసులు కండువాలు వేసి ఆహ్వానించారు. దబ్బర లక్ష్మీనారాయణ, మనోహర్, ప్రభాకర్, బన్ని అశోక, సుంకన్న, ప్రసాద్, బెళుగుప్ప వెంకట్రామిరెడ్డి, మాజీ సర్పంచ వన్నూరుస్వామి, కంచిరాముడు పాల్గొన్నారు.
Updated Date - May 04 , 2024 | 12:20 AM