TDP : టీడీపీతోనే వడ్డెర్ల అభివృద్ధి : సవిత
ABN, Publish Date - Apr 23 , 2024 | 01:01 AM
వడ్డెర సామాజిక వర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని టీడీపీ కూటమి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. గోరంట్ల లోని ఎస్‌ఎల్‌ఎన ఫంక్షనహాల్‌లో సోమవారం వడ్డెర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట ఆంజనప్ప, రాష్ట్ర వడ్డెర సాధికార కమిటీ కన్వీనర్ వడ్డె వెంకట్, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన మాజీ చైర్మన దేవేళ్ల మురళి హాజరయ్యారు.
గోరంట్ల, ఏప్రిల్ 22: వడ్డెర సామాజిక వర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని టీడీపీ కూటమి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. గోరంట్ల లోని ఎస్‌ఎల్‌ఎన ఫంక్షనహాల్‌లో సోమవారం వడ్డెర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట ఆంజనప్ప, రాష్ట్ర వడ్డెర సాధికార కమిటీ కన్వీనర్ వడ్డె వెంకట్, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన మాజీ చైర్మన దేవేళ్ల మురళి హాజరయ్యారు. వడ్డెర్లను మొదట గుర్తించింది టీడీపీనే అని, గతంలో వడ్డెర్ల అభివృధ్దికి చంద్రబాబు రూ. 132కోట్లు మంజూరు చేశా రని మురళి తెలిపారు. వడ్డెర్లపై దాడులు, దౌర్జాన్యలు జరిగినప్పడు టీడీపీ అండగా నిలిచి కాపాడిం దని వడ్డె వెంకట్ తెలిపారు. ఎనడీఏ కూటమి విడుదల చేసిన బీసీ డిక్లరేషనద్వారా వడ్డెర్లకు అనేక ప్రయోజ నాలు చేకూరతాయన్నారు.
వడ్డెర్లను ఆదరించేది చంద్రబాబే అని, మన హక్కుల సాధనకోసం మనమంతా టీడీపీ వెంట నడవాలని కొల్లకుంట ఆంజనప్ప పేర్కొన్నారు. అనంతరం సవిత మా ట్లాడుతూ.. వడ్డెర సామాజిక వర్గం వారితో తనకు అవినాభావ సంబంధాలున్నాయని, కంకర మిల్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీ సర్పంచలు, కార్పొరేషన చైర్మన్లు ఉండికూడా వైసీపీ పాలనలో నిధులు లేక నిలువు దోపిడికి గురయ్యారన్నారు. గత పదేళ్లు వైసీపీకి నాయకత్వ లోపం కారణంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా శంకర్‌నారాయణ, ఉషశ్రీ చరణ్‌ను, ఎంపీలుగా గోరంట్ల మాధవ్, శాంతమ్మను ఇతర ప్రాంతాలనుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గోరంట్లలో కమ్యూనిటీ భవనం ఏర్పాటుకు, వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తనవంతు కృషి చేస్తాన న్నారు. ఎమ్మెల్యే గాతనను, ఎంపీగా పార్థసారఽథిని గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా వడిగేపల్లి, రాగిమేకలపల్లి, తాటిమేకలపల్లి, గడ్డం తండాలకు చెందిన వైసీపీ వారు పలువురు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్వీనర్ సోముశేఖర్, వడ్డెర హనుమయ్య, గోవిందురాజులు, రవీంద్ర, అశోక్, రామాంజి, రవిమోహన, బాలక్రిష్ణ, శ్రీనివాసులు, ప్రసాద్ తదితరులున్నారు.
వైసీపీని వీడి 32 కుటుంబాలు టీడీపీలోకి..
పెనుకొండ టౌన: నియోజకవర్గ వ్యాప్తంగా 32కుటుంబాలు సోమవారం వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం టీడీపీ కూటమి అభ్యర్థి సవిత వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సోమందేపల్లి మండలం కేతగానిచెరువులో తొమ్మిది కుటుం బాలు, గోరంట్ల మండలం వడిగేపల్లి నుంచి ఆరు, పాలసముద్రం పంచాయతీ రాగిమేకలపల్లి నుంచి 12, తాటిమేకలపల్లి నుంచి మూడు, గడ్డంతండా నుంచి రెండు కుటుంబాలు పార్టీలో చేరారు. స్థానికంగా అధికార పార్టీ వైసీపీలో నాయకులు వస్తుంటారు, దోచుకుని వెళ్తుం టారని విమర్శించారు. తమ పరిస్థితి పట్టించుకునే వారు లేరన్నారు. దీంతో స్థానికంగా ఉంటున్న సవిత చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Apr 23 , 2024 | 01:01 AM