LIQUOR : మద్యం మత్తులో గ్రామాలు
ABN, Publish Date - May 11 , 2024 | 12:18 AM
ప్రస్తుతం ఎన్నిల సమయంలో మండలంలోని గ్రామాలు మద్యం మత్తులో తూగుతున్నాయి. ఈ మద్యం మత్తులో కొన్ని గ్రామాల్లో ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక మద్యం గ్రామాల్లో ఏరులైపారుతోందని మండలంలోని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. సెబ్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు సరియైున నిఘా ఉంచడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. అసలే ఎన్నికల సమయం విచ్చలవిడిగా కర్ణాటక మద్యం గ్రామా ల్లోకి వస్తుండ డం తో... దానిని తాగి కొంతమంది అనవ సరమైన గొడవలకు దిగుతున్నారని పలు గ్రా మాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
మడకశిర రూరల్, మే 10: ప్రస్తుతం ఎన్నిల సమయంలో మండలంలోని గ్రామాలు మద్యం మత్తులో తూగుతున్నాయి. ఈ మద్యం మత్తులో కొన్ని గ్రామాల్లో ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక మద్యం గ్రామాల్లో ఏరులైపారుతోందని మండలంలోని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. సెబ్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు సరియైున నిఘా ఉంచడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి.
అసలే ఎన్నికల సమయం విచ్చలవిడిగా కర్ణాటక మద్యం గ్రామా ల్లోకి వస్తుండ డం తో... దానిని తాగి కొంతమంది అనవ సరమైన గొడవలకు దిగుతున్నారని పలు గ్రా మాల ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతు న్నారని అంటున్నారు. ఎన్నిల ప్రచారం అంటే మం దుబాబులు ముందు అంటున్నారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు గట్టి నిఘా ఉంచి కర్ణాటక మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
సరిహద్దులో నిఘా పెంచుతాం - ధీరజ్‌రెడ్డి, సెబ్ సీఐ, మడకశిర
సరిహద్దు గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం రవాణా కాకుండా గట్టి నిఘా ఉంచాం. మడకశిర ప్రాంతం ఎక్కువ భాగం కర్ణాటక సరిహద్దులో ఉంది. దీంతో ఎంత నిఘా ఉంచినా ఇబ్బందులు తప్పడం లేదు. అక్ర మంగా మద్యం రాకుండా మరింత నిఘా పెంచుతాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 11 , 2024 | 12:18 AM