postal ballots: ఓటు ఎంతో విలువైనది: ఎస్పీ
ABN, Publish Date - May 10 , 2024 | 12:42 AM
రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటుహక్కు ప్రతిపౌరుడికి ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు.
పుట్టపర్తి రూరల్, మే 9: రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటుహక్కు ప్రతిపౌరుడికి ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు.
జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌బ్యాలెట్ ఫెసిలిటేషన కేంద్రంలో గురువారం ఆయన తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది తమ ఓటుహక్కును తప్పని సరిగా వినియోగించుకోవాలని తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 10 , 2024 | 12:42 AM