HLC : హెచ్చెల్సీకి 28 తర్వాతే నీరు
ABN, Publish Date - Jul 10 , 2024 | 11:45 PM
హెచ్చెల్సీకి ఈ నెల 28 తర్వాతే సాగు నీరు వచ్చే అవకాశం ఉందని ఎస్‌ఈ రాజశేఖర్ తెలిపారు. మండల కేంద్రంలోని శ్రీచిక్కణ్ణేశ్వర చెరువు వద్ద ఉన్న షెట్టర్లను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 25 టీఎంసీల నీరు ఉందని, 40 టీఎంసీల నీరు రాగానే డ్యాం అధికారులు హెచ్చెల్సీకి నీటి విడుదల చేస్తారన్నారు. తమ అంచనా ప్రకారం మరో 15 రోజుల్లోపు 40 టీఎంసీల నీరు డ్యాంలోకి చేరే అవకాశం ఉందన్నారు. అలాగే హెచ్చెల్సీ 112, 119, 181 కి.మీ. ...
హెచ్చెల్సీకి 28 తర్వాతే నీరు
కణేకల్లు, జూలై 10: హెచ్చెల్సీకి ఈ నెల 28 తర్వాతే సాగు నీరు వచ్చే అవకాశం ఉందని ఎస్‌ఈ రాజశేఖర్ తెలిపారు. మండల కేంద్రంలోని శ్రీచిక్కణ్ణేశ్వర చెరువు వద్ద ఉన్న షెట్టర్లను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 25 టీఎంసీల నీరు ఉందని, 40 టీఎంసీల నీరు రాగానే డ్యాం అధికారులు హెచ్చెల్సీకి నీటి విడుదల చేస్తారన్నారు. తమ అంచనా ప్రకారం మరో 15 రోజుల్లోపు 40 టీఎంసీల నీరు డ్యాంలోకి చేరే అవకాశం ఉందన్నారు. అలాగే హెచ్చెల్సీ 112, 119, 181 కి.మీ. వద్ద మరమ్మతు పనులను చేస్తున్నామని మరో రెండురోజుల్లోపు అవి పూర్తవుతా యన్నారు. హెచ్చెల్సీ పరిధిలో తాడిపత్రి వరకు దాదాపు 25 అత్యవసర పనులకు
సంబంధించి రూ.2.92 కోట్ల ప్రతిపాదనలు పెట్టామని, ఆ నిధులు రాగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హెచ్చెల్సీలో శాశ్వత పనుల కోసం రూ.34 కోట్లతో ప్రతిపాదనలు పంపగా వాటిని రీమోడలైజ్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఎస్‌ఈ వివరించారు. చిక్కణ్ణేశ్వరచెరువు షట్టర్ల వద్ద కల్వర్టు పడిపోయినందున కాలువకు నీరు వస్తే గంగలాపురం, రచ్చుమర్రితో పాటు ఆయకట్టు భూముల రైతుల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని, ప్రత్యామ్నాయచర్యలు చేపట్టాలని స్థానిక టీడీపీ నాయకులు ఎస్‌ఈని కోరారు. కార్యక్రమంలో ఈఈ వెంకటరమణారెడ్డి, డీఈ మద్దిలేటి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మరమ్మతు పనులు వేగవంతం చేయండి
బొమ్మనహాళ్: హెచ్చెల్సీలో మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఎస్‌ఈ రాజశేఖర్ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని దేవగిరిక్రాస్, డీ.హీరేహాళ్ మండలం చెర్లోపల్లి వద్ద జరుగుతున్న యూటీ, కోతకు గురైన కాలువ గట్టు, 1వ డిసి్ట్రబ్యూటరీ పనులను ఎస్‌ఈ రాజశేఖర్, ఈఈ రమణారెడ్డి బుధవారం పరిశీలించారు. 119/638 కి.మీ., చెర్లోపల్లి వద్ద దెబ్బతిన్న యూటీ, దేవగిరిక్రాస్ వద్ద డిసి్ట్రబ్యూటరీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ ప్రస్తుతం అత్యవసరమైన చోట మాత్రమే పనులు చేస్తున్నామన్నారు. 112 కి.మీ. వద్ద దెబ్బతిన్న కాలువగట్టు పనులు ఇప్పటికే పూర్తి అయ్యినట్లు తెలిపారు. తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల కానున్న నేపథ్యంలో త్వరగా మరమ్మతు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు వెల్లడించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Jul 10 , 2024 | 11:45 PM