శాంతియుతంగానే ఓట్లు అడుగుతున్నాం
ABN, Publish Date - Apr 30 , 2024 | 12:13 AM
ప్రశాంతంగా ఉన్న మడకశిర నియోజకవర్గంలో శాంతియు తంగానే ఎన్నికల ప్రచారం సాగిస్తూ ఓట్లను అభ్యర్థిస్తు న్నామని టీడీపీ పురం పార్ల మెంట్ అభ్యర్థి బీకే పార్థ సారథి పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజుతో కలిసి సోమవారం గుడిబండ మండ లంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ... మడకశిర నియోజకవ ర్గంలో కత్తులు పట్టి, రౌడీయిజం చేస్తూ టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన సొంత పత్రిక, చానల్‌లో వస్తున్న కథనాలపై స్పందించారు.
టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి
గుడిబండ, ఏప్రిల్ 29 : ప్రశాంతంగా ఉన్న మడకశిర నియోజకవర్గంలో శాంతియు తంగానే ఎన్నికల ప్రచారం సాగిస్తూ ఓట్లను అభ్యర్థిస్తు న్నామని టీడీపీ పురం పార్ల మెంట్ అభ్యర్థి బీకే పార్థ సారథి పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజుతో కలిసి సోమవారం గుడిబండ మండ లంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ... మడకశిర నియోజకవ ర్గంలో కత్తులు పట్టి, రౌడీయిజం చేస్తూ టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన సొంత పత్రిక, చానల్‌లో వస్తున్న కథనాలపై స్పందించారు.
కత్తులు, కటారాలు చూపి ప్రజలను భయబ్రాంతులు చేసి ఓటు వేయించుకున్న ఘనత సీఎం జగన, వారి తాత రాజారెడ్డి, తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డ్డికే దక్కిందన్నారు. వారిలాగా తాము రౌడీయిజం చేసి రాజకీయం చేయలేమ న్నారు. వజ్రాయుధం లాంటి ఓటును సైకిల్‌గుర్తుకు వేయాలని ప్రశాంతంగానే ప్రజలను కోరుతు న్నామన్నారు.
ప్రజలు టీడీపీ వైపు మొగ్గుచూపుతుండటం చూసి ఓర్వలేక టీడీపీ నాయకులపై అస త్యఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్ మద్దనకుంటప్ప, నాయకులు లక్ష్మీనరసప్ప, దుర్గేష్, రాజు, మంజునాథ్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Apr 30 , 2024 | 12:13 AM