SAVITA: టీడీపీతోనే మైనార్టీల సంక్షేమం
ABN, Publish Date - Apr 30 , 2024 | 12:06 AM
తెలుగుదేశం పార్టీతోనే మైనార్టీల సంక్షేమమని టీడీపీ కూటమి ఎమ్మె ల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె సోమవారం ఉద యం పెనుకొండ పట్టణం దర్గాపేటలో ఇంటింటా ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో సూపర్‌సిక్స్ పథకాలు, మైనార్టీలకు గతంలో ఉన్న సంక్షేమ పథకాల ను వివరించారు. చంద్రబాబును అరెస్ట్‌చేసినప్పుడు మైనార్టీలు రోడ్లపై తెలిపిన నిరసనతోనే జగన పాలనపై వారికి ఎంత వ్యతిరేక ఉందో అర్థం అవుతుందన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత
పెనుకొండ టౌన, ఏప్రిల్ 29: తెలుగుదేశం పార్టీతోనే మైనార్టీల సంక్షేమమని టీడీపీ కూటమి ఎమ్మె ల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె సోమవారం ఉద యం పెనుకొండ పట్టణం దర్గాపేటలో ఇంటింటా ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో సూపర్‌సిక్స్ పథకాలు, మైనార్టీలకు గతంలో ఉన్న సంక్షేమ పథకాల ను వివరించారు. చంద్రబాబును అరెస్ట్‌చేసినప్పుడు మైనార్టీలు రోడ్లపై తెలిపిన నిరసనతోనే జగన పాలనపై వారికి ఎంత వ్యతిరేక ఉందో అర్థం అవుతుందన్నారు.
ఈ ప్రభుత్వం ముస్లింల ద్రోహి అన్నారు. రూ.కోట్ల ము స్లిం సంక్షేమ నిధులను జగన సొంత కార్యక్రమాలకు వాడుకున్నాడన్నారు. ఈ ఐదేళ్లు మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ అధికారంలోకి వస్తే న్యా యం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థి పార్థసారథికి ఓటేసి గెలి పించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల కన్వీనర్ శ్రీరాము లు, నాయకులు షౌకత, గుట్టూరు సూరి, దాదు, షమున, జప్రుల్లా తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల: టీడీపీ కూటమి అభ్యర్థి సవిత ఆధ్వర్యంలో శివాలయం కాలనీలోని పవర్‌లుమ్స్ నిర్వాకులు కట్టా నారాయణ, కట్టా రామచంద్ర, పాండు కుటుంబ సభ్యు లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. సవిత గోరంట్లలోని వారి నివాసానికెళ్లి వారి అభ్యర్థన మేరకు పార్టీ కండు వాలు కప్పి ఆహ్వానించారు. అలాగే సవిత భర్త వెంక టేశ్వర్లు, ఆమె సోదరుడు రవికుమార్, కుటుంబ సభ్యు లు సుభద్ర, మాధవి స్థానిక నాయకులతో జట్లుగా ఏర్ప డి నాలుగు వార్డుల్లో ప్రచారం నిర్వహిఒంచారు. వారితో పాటు మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, కన్వీనర్ సోముశేఖర్, నాయకులు లక్ష్మి, నాగరాజు, ఆదిలక్ష్మి, గిరి, వెణుగోపాల్, అజంతుల్లా, కక్కల రఘు, ఉమ్మర్‌ఖాన, జనసేన, బీజేపీ నాయకులు త దితరులున్నారు.
హిందూపురం అర్బన: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత సోమవారం పరిగి మండల పరిధిలోని పుట్ట గూర్లపల్లి, మోదా, కోనాపురం, పెద్దరెడ్డిపల్లి, కొడి గెన హళ్ళి, సుబ్బరాయునిపల్లి, కాలువపల్లి, పరిగి, బోరెడ్డిప ల్లి, చిన్నపల్లిలో విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రతి గ్రా మంలో ఆమెకు బ్రహ్మరథంపట్టారు. మహిళలు హార తులతో ఆహ్వానించారు. ఈ సందర్బంగా పుట్టగూర్లప ల్లిలో టీవీఎన నరసింహప్ప టీడీపీలో చేరారు. కార్యక్ర మంలో మాజీ జడ్పీటీసీ ధనాపురం సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ కాలవపల్లి సత్యనారాయణ, నాయకులు సోమప్ప, పరిగి హనుమయ్య, ఈశ్వరయ్య, నారాయణ రెడ్డి, చెన్నక్రిష్ణారెడ్డి గోవిందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మోదశివ, ప్రవీనరెడ్డి, శ్రీరాములు, కిష్టప్ప, తిప్పారెడ్డి, రామాంజినే యులు తదితరులు హాజరయ్యారు. అలాగే ఆమె పరిగి మండలంలోని నిషా గార్మెంట్స్‌లో మహిళా కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Apr 30 , 2024 | 12:06 AM