ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

UPADHI : ఇప్పుడేమంటారు?

ABN, Publish Date - Jun 23 , 2024 | 12:06 AM

కూలీలకు అందాల్సిన ఉపాధి సొమ్మును కొందరు స్వార్థపరులు బోగస్‌ మస్టర్ల ద్వారా తమ జేబుల్లో వేసుకున్నారు. జిల్లాలోని జాబ్‌కార్డులు, కూలీల ఆధారంగా 2 కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉంది. అయితే జిల్లాకు 90లక్షలు పనిదినాలు మాత్రమే కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 61.30లక్షలు పనిదినాలు పూర్తి చేశారు. ఇందులో బోగస్‌ మస్టర్ల ద్వారా సుమారు 5లక్షల పనిదినాలు నమోదు చేసినట్లు సమాచారం. ఒక్కో పనిదినానికి రూ.220 చొప్పున 5 లక్షల పనిదినాలకు రూ.11కోట్లను ఉపాధి సిబ్బంది, గత వైసీపీ ప్రభుత్వంలోని కొందరు ...

Laborers doing work

బోగస్‌ మస్టర్లతో రూ.కోట్లు దోపిడీ

కూలీల పొట్టకొట్టిన డ్వామా సిబ్బంది

ఉపాధి సొమ్ము వాటాలుగా పంపకాలు

జేబులు నింపుకున్న కొందరు అధికారులు, వైసీపీ నాయకులు

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 22:

కూలీలకు అందాల్సిన ఉపాధి సొమ్మును కొందరు స్వార్థపరులు బోగస్‌ మస్టర్ల ద్వారా తమ జేబుల్లో వేసుకున్నారు. జిల్లాలోని జాబ్‌కార్డులు, కూలీల ఆధారంగా 2 కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉంది. అయితే జిల్లాకు 90లక్షలు పనిదినాలు మాత్రమే కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 61.30లక్షలు పనిదినాలు పూర్తి చేశారు. ఇందులో బోగస్‌ మస్టర్ల ద్వారా సుమారు 5లక్షల పనిదినాలు నమోదు చేసినట్లు సమాచారం. ఒక్కో పనిదినానికి రూ.220 చొప్పున 5 లక్షల పనిదినాలకు రూ.11కోట్లను ఉపాధి సిబ్బంది, గత వైసీపీ ప్రభుత్వంలోని కొందరు ప్రజా ప్రతినిధులు వాటాలుగా పంచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి కూలీలకు దక్కాల్సిన రూ.11కోట్లు నిధులను కొందరు డ్వామా


అధికారులు, ఉపాధి సిబ్బంది, వైసీపీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు తమ జేబుల్లో వేసేసుకున్నారు. అంటే బోగస్‌ మస్టర్ల నమోదు ఏస్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఉపాధి కూలీలకు రోజుకు రూ.300 కనీస వేతనం పడాల్సిన పరిస్థితుల్లో బోగస్‌ మస్టర్లతో రూ.220 మాత్రమే పడుతోంది. దీంతో రోజకు ఉపాధి కూలీకి రూ.80 నష్టం జరుగుతోంది. బోగ్‌సమస్టర్ల నమోదును అడ్డుకోవాల్సిన డ్వామా అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం నిద్రమత్తులో జోగుతోంది. నిఘా విభాగం అధికారులు మామూళ్ల దెబ్బకు నోరు కట్టేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఉన్నతాధికారులు దీనిపై ఏమంటారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని పలువురు కూలీలు ఎదురు చూస్తున్నారు.

కుందుర్పిలో తక్కువ పనిదినాలు

ఈ ఏడాదికి సంబంధించి ఉపాధి పనిదినాలు కుందుర్పి మండలంలో అత్యల్పంగా నమోదయ్యాయి. ఈ మండలంలో 84వేలు పనిదినాలు పూర్తి చేశారు. జూన మాసానికి ఈ పాటికి కనీసం 3లక్షలు ప్రతి మండలంలో పనిదినాలు పూర్తి చేయాల్సి ఉంది. అయితే గుంతకల్లు, పెద్దవడుగూరు, నార్పల, యల్లనూరు మండలాలు మినహా ఏ ఒక్క మండలంలోనూ 3 లక్షల పనిదినాలు పూర్తి కాలేదు. వెనుకబడిన మండలాల్లో పనులు కల్పించడంలో డ్వామా అధికారులు, ఉపాధి సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. ఒకవేళ పని కల్పించినా బోగ్‌సమస్టర్ల నమోదుతో ఉపాధి కూలీల పొట్టకొడుతున్నారు. ఎక్కువ పనిదినాలు నమోదు చేసిన మండలాల్లోనే బోగస్‌ మస్టర్లు, ఉపాధి నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


గిట్టుబాటు కావడం లేదు

ఉపాధి పనులకు వెళ్తున్నా... పనికి తగిన కూలి గిట్టుబాటు కావడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఉపాధి అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదు. ఎంతపని చేసినా ఒక్కటే కూలి ఇస్తున్నారు. పెంచాలని అడిగిన పట్టించుకునే నాథుడే లేడు. ముఖ్యంగా పనిచేసే చోట తాగునీరు, నీడ, మజ్జిగ వసతులు కల్పించి, పనిముట్లు ఇవ్వాలి. సుమారు నాలుగైదేళ్లుగా పనిముట్లు ఇవ్వడం లేదు. సొంతంగా పని ముట్లు తెచ్చుకుని పనిచేసినా కూలి గిట్టుబాటు కావడం లేదు.

- విజయలక్ష్మి, ఉపాధి కూలీ, విడపనకల్లు

విచారణ జరిపించాలి

ఉపాధి పనుల్లో జరుగుతున్న బోగస్‌ మస్టర్ల అక్రమాలపై విచారణ జరిపించాలి. బాధ్యులైన ఉపాధి సిబ్బంది, డ్వామా అధికారులపై చర్యలు తీసుకోవాలి. పెండింగ్‌లో ఉన్న నెల రోజుల ఉపాధి కూలీల వేతనాలు రూ.10కోట్లు వెంటనే చెల్లించాలి. అధిక కూలి గిట్టేలా ఉపాధి సిబ్బంది పనులు కల్పించాలి. బోగస్‌ మస్టర్లను నియంత్రిస్తే కూలీలకు కనీస గిట్టుబాటు కూలి దక్కుతుంది.

- కేశవరెడ్డి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

వంద రోజుల పని కల్పనే లక్ష్యం

ఉపాధి పనుల్లో బోగస్‌ మస్టర్ల నమోదుకు అవకాశం లేదు. బోగ్‌సమస్టర్లు ఎక్కడైనా నమోదైనట్లు మా దృష్టికి వస్తే...బాధ్యులైన సిబ్బందిపై కచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించి జాబ్‌కార్డుదారుల వలసలను నివారించడానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం.. ప్రతి మండలంలో కేటాయించిన పనిదినాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సూచించాం. ప్రతి కూలీకి గిట్టుబాటు వేతనం పడేలా పనులు చేయిస్తున్నాం. జాబ్‌కార్డుదారులందరికీ వంద రోజుల పని దినాలు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

- వేణుగోపాల్‌ రెడ్డి, డ్వామా పీడీ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 23 , 2024 | 12:06 AM

Advertising
Advertising