ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DSA Indoor Stadium : ఇంకా ఏం చేస్తే స్పందిస్తారో..?

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:47 AM

ప్రభుత్వ ఆస్తిని అమ్మేశానని బహిరంగంగా జిల్లా స్థాయి అధికారి చెబుతున్నా ఎలాంటి చర్యలు లేవు. నిధుల దుర్వినియోగం జరిగింది క్రిమినల్‌ కేసులు నమోదు చేయండన్న ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర య్యాయి. మరి ఏమి చేస్తే చర్యలు తీసుకుంటారో? మిగిలిన ప్రభుత్వ సామగ్రి, ఆస్తులను కూడా తెగనమ్మాలా? జిల్లా ప్రజల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదంతా జిల్లా క్రీడాశాఖలో ఓ అధికారి అవినీతి బాగోతం గురించే. ...

This is the place where the generator disappeared

జనరేటర్‌ అమ్మేసినా చర్యలు లేవు

డిపాజిట్‌ సొమ్ము స్వాహా చేసినా అంతే

ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్‌

అస్తవ్యస్తంగా జిల్లా క్రీడాశాఖ

ప్రభుత్వ ఆస్తిని అమ్మేశానని బహిరంగంగా జిల్లా స్థాయి అధికారి చెబుతున్నా ఎలాంటి చర్యలు లేవు. నిధుల దుర్వినియోగం జరిగింది క్రిమినల్‌ కేసులు నమోదు చేయండన్న ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర య్యాయి. మరి ఏమి చేస్తే చర్యలు తీసుకుంటారో? మిగిలిన ప్రభుత్వ సామగ్రి, ఆస్తులను కూడా తెగనమ్మాలా? జిల్లా ప్రజల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదంతా జిల్లా క్రీడాశాఖలో ఓ అధికారి అవినీతి బాగోతం గురించే.

అనంతపురం క్లాక్‌టవర్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): నగరంలోని అశోక్‌నగర్‌లోని డీఎస్‌ఏ ఇండోర్‌స్టేడియంలోని రూ.12లక్షల విలువైన జనరేటర్‌ మాయమవడం, శాఖకు సంబంధించిన నిధులు సుమారు రూ.50లక్షల దుర్వినియోగం అయినట్లు గత నెలలో ‘ఆంధ్రజ్యోతి’లో దొరికినంత దోచుకో శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అనే కథనానికి అశోక్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియానికి వచ్చి, సీనియర్‌ కోచ


అనిల్‌కుమార్‌తో వివరాలు ఆరా తీశారు. వాస్తవాలు తెలుసుకుని వెంటనే క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అయితే నెలరోజులు గడిచినా ఎటువంటి చర్యలు లేవు. జిల్లా అధికారి మిగిలిన ఇండోర్‌స్టేడియాన్ని కూడా ఇతరులకు అమ్మేస్తే తప్ప ప్రభుత్వం, అధికారుల నుంచి చలనం ఉండదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎమ్మెల్యే హడావుడి ఉత్తదేనా..?

గత నెలలో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన దొరికినంత దోచెయ్‌ కథనానికి స్పందించిన అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ హడావుడిగా అశోక్‌నగర్‌ ఇండోర్‌స్టేడియానికి వచ్చారు. జనరేటర్‌, స్పోర్ట్స్‌ సామగ్రి మాయం, నిధుల దుర్వినియోగంపై ఆరా తీశారు. శాప్‌ సీనియర్‌ కోచ అనిల్‌కుమార్‌తో పాటు ఇతర కోచల ద్వారా ఇండోర్‌స్టేడియం, జిల్లా క్రీడాశాఖలో జరుగుతున్న పరిణామాలపై అడిగి తెలుసుకున్నారు. జనరేటర్‌, స్పోర్ట్స్‌ మెటీరియల్‌ మాయంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయించి డీఎ్‌సడీఓపై క్రిమినల్‌ కేసు నమోదు చేయించాలని కోచలకు ఎమ్మెల్యే సూచించారు. డీఎ్‌సడీఓ వ్యవహారాన్ని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి, శాప్‌ చైర్మనల దృష్టికి తీసుకెళ్లి శాఖాపరమైన చర్యలు తీసుకునేలా చూస్తానని కోచలు, క్రీడాకారులకు హామీ ఇచ్చారు. క్రీడలు, క్రీడాకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అయితే అవేవీ ఆచరణ సాధ్యం కాలేదు.

అస్తవ్యస్తంగా మారిన క్రీడాశాఖ

గడిచిన ఐదేళ్లలో క్రీడాశాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారు. కోచలు, ఆఫీస్‌ సిబ్బందిని నియంత్రించి, మెరుగైన ఫలి తాలు సాధించే సారథులే కరువ య్యారు. నాలుగున్నరేళ్ల పాటు కాలయాపన చేసిన వైసీపీ ప్రభుత్వం చివరి దశలో ఆడుదాం ఆంధ్రా అంటూ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో నిధులు దుర్విని యోగం భారీగా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు సుమారు 24మంది కోచలు, ఆరుగురు కార్యాలయ సిబ్బంది అవసరం కాగా సగం మంది కూడా ప్రస్తుతం పనిచేయడం లేదు. సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో అరకొరగా ఉన్న కోచలు, సిబ్బంది పనిఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేసి, స్టేడియంలో మౌలిక వసతులు కల్పిస్తారని క్రీడాకారులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఫ్లడ్‌లైట్లు వెలగడం లేదు: అనిల్‌కుమార్‌, శాప్‌ కోచ

ఇండోర్‌ స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు వెలగడం లేదు. దీంతో కబడ్డీ ప్రాక్టీస్‌ ను ఎస్‌ఎస్‌బీఎన కాలేజీ మైదానంలో చేయిస్తున్నాం. స్టేడియం లోపల షటిల్‌ బ్యాడ్మింటన కోర్టు మీదకు వర్షం నీళ్లు లీకేజీ అవుతున్నాయి. దీంతో క్రీడాకారులు సాధనకు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టేడియం లోపల వసతులు మెరుగుపరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

జనరేటర్‌ అమ్మేశా: షేక్‌ షఫీ, డీఎస్‌డీఓ

జనరేటర్‌ రిపేరీకి ఇచ్చామన్న మాట అవాస్తవం. అశోక్‌నగర్‌ ఇండోర్‌స్టేడియంలో ఉన్న జనరేటర్‌ను అమ్మేశాను. క్రీడాసామగ్రి కూడా పంచేశాను. వచ్చిన డబ్బులతో స్టేడియంలో కొన్ని వసతులు అభివృద్ధి చేశాను. ఇది అందరికీ తెలిసిందే. కలెక్టర్‌, శాప్‌ చైర్మన అడిగినా ఇదే చెప్పాను. స్టేడియం లోపల వర్షం వస్తే లీకేజీ అవుతున్న మాట వాస్తవమే. ఇక కబడ్డీ కోర్టులో ఫ్లడ్‌లైట్లు వెలగడం లేదు. స్టేడియంలో అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాం. ప్రభుత్వం సహకరిస్తే మరింత అభివృద్ధి చేస్తాం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 12 , 2024 | 12:47 AM