SAVITA : అడ్డదారుల్లో గెలిచేందుకు వైసీపీ యత్నం
ABN, Publish Date - May 11 , 2024 | 12:02 AM
అవినీతికి పాల్పడి సం పాదించిన సొమ్ముతో అడ్డగోలుగా ఎన్నికల్లో గెలించేం దుకు ప్రయత్నిస్తున్న మంత్రి ఉషశ్రీని చిత్తుగా ఓడిం చాలని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె శుక్రవారం సోమందేపల్లి మండలంలోని కొనతట్టు పల్లి, వెలగమాకులపల్లిల్లో విస్తృతస్థాయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరించి ఎంపీ అభ్యర్థి బీకే పార్థ సారథికి, తనకు సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధి క మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత
పెనుకొండ టౌన, మే 10 : అవినీతికి పాల్పడి సం పాదించిన సొమ్ముతో అడ్డగోలుగా ఎన్నికల్లో గెలించేం దుకు ప్రయత్నిస్తున్న మంత్రి ఉషశ్రీని చిత్తుగా ఓడిం చాలని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె శుక్రవారం సోమందేపల్లి మండలంలోని కొనతట్టు పల్లి, వెలగమాకులపల్లిల్లో విస్తృతస్థాయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరించి ఎంపీ అభ్యర్థి బీకే పార్థ సారథికి, తనకు సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధి క మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం సవిత మాట్లాడుతూ... దోచుకోవడంలో కళ్యాణదుర్గంలో అనకొండగా పేరొందిన ఉషశ్రీ ఇక్కడ తిమింగళం అవ తారం ఎత్తబోతోందని విమర్శించారు. నియోజకవర్గ ప్ర జలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ఐదేళ్లుగా రాష్ట్రంలో వైసీపీ అరాచక ప్రభుత్వం ప్రజలను ఎన్నోరకాలుగా ఇబ్బందులకు, అవస్థలకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం ప్రజలకు ప్ర సాదించిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను సీఎం జగన పూర్తిగా హరించవేశారని మండి పడ్డారు. అందుకే ఈ అరాచక ప్రభుత్వాన్ని ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సాగనంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఐదేళ్లు రా ష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది టీడీపీ నాయకులు, కార్యకర్త లు తమ జీవితాలను త్యాగంచేసి, ప్రాణాలను ఫణంగా పెట్టి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడార న్నారు. అటువంటి కార్యకర్తలను మరిచే ప్రసక్తే లేద న్నారు. ముఖ్యమంత్రి అంటే కేవలం బటన నొక్కడమే కాదు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలన్నారు. నియోజకవర్గంలో టీడీపీ మెజార్టీ భారీ స్థాయిలో ఉండేలా ఓటు వేయాలని కోరారు.
రొద్దం : మండలపరిధిలోని తురకలాపట్నానికి చెందిన సింగిల్‌విండో సొసైటీ అధ్యక్షుడు కేపీ శ్రీనివాసు లు శుక్రవారం టీడీపీలో చేరారు. పెనుకొండలోని టీడీపీ కార్యాలయంలో ఆయనకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. అలాగే అదే గ్రామాని కి చెందిన వైసీపీ కార్యకర్త శివ, నల్లూరుకు చెందిన వైసీపీ నాయకుడు ఓబులేసు టీడీపీలో చేరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 11 , 2024 | 12:02 AM