High Court: ఎంపీ రఘురామ విషయంలో సుప్రీం గైడ్ లైన్స్ పాటించాలి.. స్పష్టం చేసిన హైకోర్టు
ABN, Publish Date - Jan 12 , 2024 | 05:51 PM
సంక్రాతి పండుగకు తన సొంత నియోజకవర్గం నరసాపురానికి వస్తున్న తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. చట్ట నిబంధనలు పాటించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
అమరావతి: సంక్రాతి పండుగకు తన సొంత నియోజకవర్గం నరసాపురానికి వస్తున్న తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. చట్ట నిబంధనలు పాటించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ పై విచారించిన హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎంపీపై ఎలాంటి ఫిర్యాదులున్నా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కేసు పెట్టాలంటే నోటీసులు ఇవ్వాలని తెలిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ వైవీ రవిప్రసాద్, ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు.
Updated Date - Jan 12 , 2024 | 05:59 PM