ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాధ్యులను గుర్తించి వెంటనే జైల్లో పెట్టండి!

ABN, Publish Date - May 16 , 2024 | 04:24 AM

రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తీవ్రంగా స్పందించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేశ్‌ కుమార్‌ మీనా చెప్పారు.

తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, పేట ఘటనలపై ఈసీ సీరియస్‌

కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్టు గుర్తించాం

వారిపైనా త్వరలో చర్యలు: సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా

అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తీవ్రంగా స్పందించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేశ్‌ కుమార్‌ మీనా చెప్పారు. హింసాత్మక ఘటనల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. పోలింగ్‌ రోజు కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినప్పటికీ, ఎన్నికల, పోలీస్‌ యంత్రాంగం వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడం వల్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయన్నారు. పోలింగ్‌ అనంతరం 4 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని, ఈ ఘటనల్లో ఎవరెవరిని గుర్తించామో వారందరినీ అరెస్ట్‌ చేసి జైల్లో పడేయాలని ఈసీ ఆదేశించిందని చెప్పారు. ఈ ప్రక్రియ మంగళవారం నుంచే కొనసాగుతోందని, ఇప్పటికే చంద్రగిరిలో 30 మందిని, నరసరావుపేటలో ఐదుగురిని గుర్తించి అరెస్టు చేశారని తెలిపారు. ఎన్నికల విధుల్లో కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు గుర్తించామని, వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వారిని గుర్తించే పనిలో డీజీపీ సహా ఉన్నతాధికారులంతా ఉన్నారని తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారి ఫొటోలు, వీడియోలతో సహా ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట ఘటనల్లో అందరినీ గుర్తించామని, కారకులైన అభ్యర్థులను గృహనిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు. పల్నాడులో హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందుగానే అదనపు కేంద్ర బలగాలను మోహరించామన్నారు. ఎన్నికల రోజు 9 ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విదేశాల నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడం, చివరి రెండు గంటల ముందు భారీ క్యూలైన్లలో ఓటర్లు ఉండడం వల్ల అర్ధరాత్రి వరకూ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగిందని మీనా తెలిపారు.


ఓటింగ్‌ కోసం రైలును పరుగెత్తించాం..

ఎన్నికల రోజు నాందేడ్‌-విశాఖపట్నం రైలు ఆలస్యంగా నడవడం వల్ల అందులో ప్రయాణించే ఓటర్లు తమ ఓటుహక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని మీనా చెప్పారు. దీంతో తమ సూచనల మేరకు అదనపు సీఈవో కోటేశ్వరరావు ఎంతో చాకచక్యాన్ని ప్రదర్శించి విజయవాడ, రాజమండ్రి విశాఖపట్నం డీఆర్‌ఎంలతో మాట్లాడి ఆ ట్రైన్‌ గ్రీన్‌ చానల్‌లో వేగంగా గమ్యాన్ని చేరుకునేలా చేశారని అభినందించారు. అలాగే, మహారాష్ట్రలో ఎన్నికల విధులకు వెళ్లిన వారికి ప్రత్యేక సీఎల్‌ మంజూరు చేయడంతోపాటు వారు నేరుగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు.

Updated Date - May 16 , 2024 | 04:24 AM

Advertising
Advertising