Chandrababu : ప్రగతి పరుగు
ABN, Publish Date - Oct 15 , 2024 | 04:24 AM
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేలా, పారిశ్రామిక వేత్తలు వెల్లువలా వచ్చేలా నూతన పారిశ్రామిక పాలసీలు రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
నూతన పారిశ్రామిక పాలసీల లక్ష్యం ఇదే కావాలి
అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేస్తూ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ దిశగా దూసుకెళ్లాలి
ముందు వచ్చిన కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు
ఎక్కువ ఉద్యోగాలిస్తే 10ు అదనపు ఇన్సెంటివ్‌లు
ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 5 శాతం అదనం
అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా అమరావతి
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేలా, పారిశ్రామిక వేత్తలు వెల్లువలా వచ్చేలా నూతన పారిశ్రామిక పాలసీలు రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సోమవారం సచివాలయంలో పారిశ్రామికాభివృద్ధి, ఎం ఎ్‌సఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీల రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు. గతంలో ఇతర రాష్ట్రాల పాలసీలను అధ్యయనం చేసి, పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ అధికారులు రూపొందించిన వివిధ డ్రాఫ్ట్‌ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్ప నే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. దీనికి అనుగుణంగా నే పారిశ్రామిక పాలసీలు ఉండాలన్నారు. పారిశ్రామికవేత్తలకు ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా నిలవాలని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆవిష్కరణలకు దోహదపడేలా నూతన పాలసీలను రూపొందించాలని ఆదేశించారు. ఈ నూతన పాలసీలతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి, దేశంలోని ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలన్నారు. నూతన పారిశ్రామిక పాలసీలు అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లి్‌షమెంట్, డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇచ్చిన మొదటి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రాతిపాదనలు చేశారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10 శాతం ప్రోత్సాహకాలు ప్రతిపాదించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్ర్కో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహాలు ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. దీనివల్ల జాప్యం లేకుండా కంపెనీలకు ఇన్సెంటివ్‌లు అందుతాయని వివరించారు.
వారికి అదనంగా 5 శాతం ప్రోత్సాహకాలు
‘ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త’ కాన్సె్‌ప్టతో ముందుకు వెళ్లాలనేది కూటమి ప్రభుత్వ విధానమని ఎంఎ్‌సఎంఈ పాలసీపై సమీక్ష సందర్భంగా చంద్రబాబు చెప్పారు. ఎంఎ్‌సఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనంగా 5ు ప్రోత్సాహకాలు అందించేలా ప్రతిపాదించారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్‌ల పాలసీపై మరింత కసరత్తు జరగాలని సీఎం సూచించారు. మిగిలిన ఇండస్ట్రియల్ డెవల్‌పమెం ట్, ఎంఎ్‌సఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలను త్వరలో నిర్వహించనున్న కేబినెట్ ముందుంచాలని నిర్ణయించారు. ఆక్వా, ఫౌలీ్ట్ర రంగంలో వచ్చిన విధంగా ఫుడ్ ప్రాసెసింగ్‌లో కూడా మంచి ఫలితాలు వచ్చే విధానాలను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ సూచించారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, ఎంఎ్‌సఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఐటీ రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తాలి
రాష్ట్రంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దేశ, విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడం ద్వారా యువతకు లక్షలాదిగా ఉపాధి అవకాశాలు దక్కేలా పాలసీని రూపొందించాలని అఽధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే ఐటీ ప్రోత్సాహక విధానం రూపొందించిన అధికారులను అభినందించారు. ఐటీ, డ్రోన్, ఎలకా్ట్రనిక్స్ పాలసీలపై అధికారులతో సమీక్షించారు.
అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
పారిశ్రామిక దిగ్గజం దివంగత రతన్ టాటా పేరుతో త్వరలోనే అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నామని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబ తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేసే ఇన్నోవేషన్ హబ్‌కు అనుబంధంగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటవుతా యి. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే అమరావతి స్కిల్ డెవల్‌పమెంట్, ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా రూపాంతరం చెందనుంది.
Updated Date - Oct 15 , 2024 | 04:29 AM