ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అంతు చిక్కని జ్వరం

ABN, Publish Date - Feb 22 , 2024 | 01:29 AM

ముందుగా జ్వరం వస్తుంది. ఉన్నట్టుండి కాళ్లు, చేతులు, ముఖం వాపు వచ్చేస్తుంది. నొప్పులూ తీవ్రంగా ఉంటున్నాయి.

- తిరుమూరులో 80 మందికిపైగా అనారోగ్యం

వాకాడు, ఫిబ్రవరి 21: ముందుగా జ్వరం వస్తుంది. ఉన్నట్టుండి కాళ్లు, చేతులు, ముఖం వాపు వచ్చేస్తుంది. నొప్పులూ తీవ్రంగా ఉంటున్నాయి. జ్వరం తగ్గినా నొప్పులు మాత్రం అలాగే ఉంటున్నాయి. ఇలా అంతుచిక్కని జ్వరంతో వాకాడు మండలంలోని తిరుమూరు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడినవారు 15 రోజులకుపైగా స్థానికంగా చికిత్స తీసుకున్నా.. తగ్గక పోవడంతో కోట, నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో.. నక్కా జమున, తిరుమూరు రామచంద్రయ్య, వల్లూరు చంద్రమ్మ, ప్రసూన్న, తిరుమూరు వెంకటయ్య, పామంజి చెంగయ్య, నక్కా రామసుబ్బమ్మ, కుంచం శేషమ్మ, కుంచం ఆదిలక్ష్మమ్మ కుటుంబం, గడ్డం పరసారత్నం కుటుంబం, చుట్టా పుల్లయ్య కుటుంబం, చింతలమణి, కుంచం రమణమ్మ, పాముల నాగేశ్వరరావు కుటుంబం ఇలా.. 80మందికిపైగా తిరుమూరు హరిజనవాడ ప్రతి ఇంటిలోనూ బాధితులున్నారు. దీనిపై తిరుమూరు సచివాలయంలో సమాచారం ఇచ్చినా స్థానిక వైద్యాధికారులు ఎవరూ రాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై నిడిగుర్తి పీహెచ్‌సీ వైద్యుడు రామకృష్ణ వివరణ కోరగా.. సమాచారం ఎవరూ చెప్పలేదని, గ్రామంలో అవసరమైతే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు.

నొప్పులు తగ్గడం లేదు

ఐదు రోజుల కిందట తీవ్ర జ్వరం వచ్చింది. కోటలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాను. ఆరోజు రాత్రికంతా జ్వరం తగ్గిపోయింది. అప్పటి నుంచి తట్టుకోలేని విధంగా నొప్పులు వస్తున్నాయి. ఎన్ని మాత్రలు మింగినా, ఇంజక్షన్లు వేయించుకున్నా నొప్పులు తగ్గడం లేదు.

- పామంజి చెంగయ్య, బాధితుడు

శరీరమంతా వాపులతో తట్టుకోలేకున్నా

ఎనిమిది రోజుల కిందట జ్వరం వస్తే కోటలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాను. జ్వరం తగ్గింది. అప్పటి నుంచి మొహం వాచి, కీళ్లు, మెడజీవాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నా. నొప్పులు తగ్గక పోవడంతో మరో రెండు ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేదు. శరీరం అంతా వాపులతో తట్టుకోలేక పోతున్నా.

- నక్కా జమున, బాధితురాలు

Updated Date - Feb 23 , 2024 | 07:47 AM

Advertising
Advertising