ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

యాత్రకు రండి...ప్లీజ్‌!

ABN, Publish Date - Feb 18 , 2024 | 01:16 AM

‘రండి బాబూ రండి, రండి తల్లీ రండి...మీకోసం లగ్జరీ బస్సు పెట్టాం. ఇంటర్వెల్లో స్నాక్స్‌ కూడా ఇస్తాం. బిందాస్‌గా వచ్చి సినిమా చూసి వెళ్లండి’ అంటూ చంద్రగిరి నియోజక వర్గ ప్రజల వెంట పడుతున్నారు వైసీపీ నాయకులు. జగన్‌ ప్రచారం కోసం తీసి విడుదల చేసిన యాత్ర-2 సినిమా థియేటర్లు వెలవెలపోతుండడంతో వాటిని నింపడానికి నానా అవస్థలూ పడుతున్నారు.

చంద్రగిరిలో సినిమా హాలు వద్దకు బస్సుల్లో తరలిస్తున్న జనం

తిరుపతి, ఆంధ్రజ్యోతి: ‘రండి బాబూ రండి, రండి తల్లీ రండి...మీకోసం లగ్జరీ బస్సు పెట్టాం. ఇంటర్వెల్లో స్నాక్స్‌ కూడా ఇస్తాం. బిందాస్‌గా వచ్చి సినిమా చూసి వెళ్లండి’ అంటూ చంద్రగిరి నియోజక వర్గ ప్రజల వెంట పడుతున్నారు వైసీపీ నాయకులు. జగన్‌ ప్రచారం కోసం తీసి విడుదల చేసిన యాత్ర-2 సినిమా థియేటర్లు వెలవెలపోతుండడంతో వాటిని నింపడానికి నానా అవస్థలూ పడుతున్నారు. శనివారం నుంచి చంద్రగిరిలో యాత్ర-2 సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌కు జనాన్ని తరలించే ఏర్పాట్లు ఘనంగానే మొదలు పెట్టారు. ప్రత్యేక షోలు ఏర్పాటు చేశారు. పంచాయతీకి రెండు బస్సులు చొప్పున సిద్ధం చేశారు. ఎమ్మెల్యే ఏపీఆర్వోల ద్వారా ఈ సమాచారాన్ని పంచాయతీల పరిధిలోని సచివాలయాలకు చేర్చారు. వలంటీర్ల ద్వారా ప్రేక్షకులను రాబట్టే ప్రయత్నం చేశారు. పెద్ద పంచాయతీలకు ప్రత్యేక లగ్జరీ బస్సులను పంపారు. చిన్న పంచాయతీలకు మినీ బస్సులను పంపారు. బస్సులను థియేటర్‌ వద్ద నిలిపి అందులోని వారిని దగ్గరుండి హాలు లోపలకు సాగనంపారు.ఇంటర్వెల్‌ సమయంలో సమోసా, కూల్‌డ్రింక్స్‌ అందించారు.చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలూ కవరయ్యేలా ప్లాన్‌ చేశారు. మరో మూడు రోజుల పాటు యాత్ర-2 సినిమాను ఆడేలా చేయాలన్న సంకల్పంతో వైసీపీ నేతలున్నారు. ఇందులో భాగంగా శనివారం మార్నింగ్‌ షో చూపించాలని తొలుత భావించారు. కానీ అనుకున్నంత స్పందన లేకపోవడంతో వారిని మ్యాట్నీకి మార్చారు. తొలిరోజే స్పందన లేకపోతే మిగిలిన రోజులు ఎట్లస్వామీ అని కార్యకర్తలు, వలంటీర్లు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం.

Updated Date - Feb 18 , 2024 | 01:16 AM

Advertising
Advertising