ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

శ్మశానానికి మా భూమే కావాల్సి వచ్చిందా..!

ABN, Publish Date - Feb 13 , 2024 | 12:16 AM

‘మా అనుభవంలో ఉన్న భూమిపై అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులు వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ భూమిని శ్మశాన వాటికగా మార్చేందుకు రెవెన్యూ అధికారులతో కలిసి ప్రయత్నిస్తున్నారు’ అంటూ చిత్తూరు మండలం అనుప్పల్లెకు చెందిన దళిత మహిళ నిరూప ఆవేదన వ్యక్తం చేశారు.

అర్జీదారుల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తున్న డ్వామా పీడీ రాజశేఖర్‌

అధికారులతో కలిసి అధికారపార్టీ నేతల ప్రయత్నం

‘స్పందన’లో దళిత మహిళ ఆవేదన

చిత్తూరు, ఫిబ్రవరి 12: ‘మా అనుభవంలో ఉన్న భూమిపై అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులు వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ భూమిని శ్మశాన వాటికగా మార్చేందుకు రెవెన్యూ అధికారులతో కలిసి ప్రయత్నిస్తున్నారు’ అంటూ చిత్తూరు మండలం అనుప్పల్లెకు చెందిన దళిత మహిళ నిరూప ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె దళిత సంఘాల నేతలతో కలిసి కలెక్టరేట్‌ ముందు నిరసన తెలిపారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా వివిధ సమస్యలతో సోమవారం పలు ప్రాంతాల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు చేరుకుని స్పందన కార్యక్రమంలో వినతులిచ్చారు. డ్వామా పీడీ రాజశేఖర్‌, ఆర్డీవోలు వినతిపత్రాలను స్వీకరించారు. బాధితుల సమస్యలను విన్నవారు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎండలు ప్రారంభమైన నేపథ్యంలో అర్జీదారుల సంఖ్య తగ్గింది. 212 మంది వినతిపత్రాలను అందించారు. ఇందులో రెవెన్యూశాఖకు 156, రేషన్‌కార్డులు, పెన్షన్ల కింద 12, పోలీసుశాఖకు 12 అర్జీలు పోనూ మిగిలిన శాఖలకు సంబంధించి అర్జీలున్నాయి. అధికారుల దృష్టికి వచ్చిన వాటిలో కొన్ని..

హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

హమాలీ హెడ్‌లోడ్‌ యాక్ట్‌ చట్టాన్ని అమలు చేసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు నాగరాజన్‌ డిమాండు చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ముందు జరిగిన హమాలీ వర్కర్ల ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 25 లక్షల మంది వరకు పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో హమాలీ హెడ్‌లోడ్‌ యాక్ట్‌ చట్టం అమలులో ఉందని, ఇక్కడ మాత్రం లేకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఉన్న విధంగానే హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. కార్మికులకు ఏడాదికి ఒకసారి వైద్య శిబిరం నిర్వహించాలన్నారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమాదేవి, నాయకులు మణి, రఘు, కృష్ణన్‌, కమల్‌, మణి, హమాలీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

మా గ్రామానికి దారి వసతి కల్పించండి

తమ గ్రామానికి దారి సౌకర్యం కల్పించాలని కోరుతూ జీడీనెల్లూరు మండలం కొల్లావూరు గ్రామస్తులు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. కొట్రకోన పంచాయతీ కొల్లావూరుకు ఉన్న చిన్నదారి ఆక్రమణకు గురికావడంతో పూర్తిగా దారిలేకుండా పోయిందన్నారు. జరగరాని సంఘటన ఏదైనా జరిగితే అంబులెన్స్‌ రావడానికి కూడా దారి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దారి సౌకర్యం కల్పించాలని కోరారు.

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం

కలెక్టరేట్‌ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్‌ను సంఘ సభ్యులు నిర్వహిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా జీవామృతం, ఘన జీవామృతాలతో పండించిన ఆకు కూరలు, కూరగాయలను విక్రయిస్తున్నారు. తాజాగా ఉండటంతో మహిళా ఉద్యోగులు కొనుగోలు చేశారు. గత పది వారాలుగా ఇక్కడ స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై అధికారులకు అవగాహన ఉండటం వల్ల చాలామంది తీసుకుంటున్నారని జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ వాసు తెలిపారు. ఎన్‌ఎ్‌ఫఏ మార్కెటింగ్‌ నిర్వాహ కురాలు ఫైజున్నీషా, ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:16 AM

Advertising
Advertising