ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్‌వి డబ్బామాటలు

ABN, Publish Date - Feb 27 , 2024 | 12:48 AM

హంద్రీనీవాపై సీఎం జగన్‌ అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి సోమవారం దుయ్యబట్టారు. ఒకవైపు పోలవరం పనులు కోల్డు స్టోరేజిలో పెట్టి మరోవైపు హంద్రీ నీవా ద్వారా నీటిని తాను కుప్పానికి తెచ్చానని చెప్పడం నమ్మేదానికేనా జగన్‌? అని ప్రశ్నించారు. గతంలో సీఎం చంద్రబాబు చొరవతో కుప్పం నియోజకవర్గంలోని ఆదినేపల్లి వరకు 630 కిలో మీటర్లు దూరం హంద్రీనీవా నీటిని తీసుకొచ్చామని గుర్తుచేశారు.

పలమనేరు: హంద్రీనీవాపై సీఎం జగన్‌ అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి సోమవారం దుయ్యబట్టారు. ఒకవైపు పోలవరం పనులు కోల్డు స్టోరేజిలో పెట్టి మరోవైపు హంద్రీ నీవా ద్వారా నీటిని తాను కుప్పానికి తెచ్చానని చెప్పడం నమ్మేదానికేనా జగన్‌? అని ప్రశ్నించారు. గతంలో సీఎం చంద్రబాబు చొరవతో కుప్పం నియోజకవర్గంలోని ఆదినేపల్లి వరకు 630 కిలో మీటర్లు దూరం హంద్రీనీవా నీటిని తీసుకొచ్చామని గుర్తుచేశారు. తాను గతంలో పలమనేరు నియోజకవర్గం నుంచి కుప్పం బ్రాంచి కెనాల్‌కు నీటిని విడుదల చేశానని, కేవలం 30 కిలోమీటర్లు కాలువ పనులు చేసి తామే పూర్తి చేశామని చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి చంద్రబాబు పాలనలోనే పులివెందులకు నీటిని అందించిన విషయాన్ని జగన్‌ గుర్తు తెచ్చుకోవాలన్నారు. నాలుగున్నర సంవత్సారాలు కాలయాపన చేసి ఇప్పుడు ఎన్నికల వేళ తామేదో హంద్రీనీవా జలాలు కుప్పం తెచ్చామని డబ్బామాటలు పలకుతున్నారని ఎద్దేవా చేశారు. పూజలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కాగా, మద్య నిషేధంపై తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని ప్రజలను ఓట్లు అడగాలని జగన్‌కు అమర్‌ సూచించారు.

అభివృద్ధి మాది.. ప్రచారం మీదా?: కంచర్ల

కుప్పం: కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది, హంద్రీ-నీవా పనులు 87 శాతం పూర్తి చేసింది చంద్రబాబు అయితే, ప్రచారం మాత్రం జగన్‌ చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ సోమవారం విమర్శించారు. మిగిలిన 13 శాతం పనులు కూడా అరాకొరగా చేసి నీళ్లు విడుదల చేసినట్లు ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు చేసే గిమ్మిక్కులను ప్రజలు నమ్మరన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:48 AM

Advertising
Advertising