ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: రోజాకు టిక్కెట్ ఇస్తే మేము పనిచేయం.. నగరి జడ్పీటీసీల అసమ్మతి స్వరం

ABN, Publish Date - Jan 23 , 2024 | 04:21 PM

Andhrapradesh: మంత్రి రోజాపై నగరి నియోజకవర్గ జడ్పీటీసీలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. రోజాకు టిక్కెట్ ఇస్తే తాము పని చేసే ప్రసక్తే లేదని.. కొత్త వారికి ఇస్తేనే పార్టీ గెలుపుకు కృషి చేస్తామని జడ్పీటీసీలు తేల్చిచెబుతున్నారు.

చిత్తూరు, జనవరి 23: మంత్రి రోజాపై (Minister Roja) నగరి నియోజకవర్గ జడ్పీటీసీలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. రోజాకు టిక్కెట్ ఇస్తే తాము పని చేసే ప్రసక్తే లేదని, కొత్త వారికి అవకాశం ఇస్తేనే పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని జడ్పీటీసీలు తేల్చిచెబుతున్నారు. మంగళవారం చిత్తూరు ఉమ్మడి జిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనంతరం వడమాల పేట, నిండ్ర జడ్పీటీసీలు మురళీధర్ రెడ్డి, మల్లేశ్వరి మీడియాతో మాట్లాడారు. తమ ఆవేదనను వెలిబుచ్చారు. కక్ష సాధింపుతో మంత్రి రోజా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని వాపోయారు.

అభివృద్ధి పనులకు కేటాయించిన జడ్పీ నిధులకు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా మంత్రి రోజా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. భవనాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జడ్పీటీసీలకు ప్రత్యేక గదులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చైర్మన్‌ను నిలదీశామని వడమాల పేట, నిండ్ర జడ్పీటీసీలు జడ్పీటీసీలు పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 23 , 2024 | 04:35 PM

Advertising
Advertising