ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: చంద్రబాబు సభలో భద్రతా వైఫల్యం.. పోలీసుల ప్రేక్షక పాత్ర..

ABN, Publish Date - Jan 27 , 2024 | 01:30 PM

తిరుపతి: ‘‘రా.. కదలిరా’’ పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన, తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా, పీలేరులో చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో భద్రతా వైఫల్యం తలెత్తింది.

తిరుపతి: ‘‘రా.. కదలిరా’’ పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన, తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా, పీలేరులో చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో భద్రతా వైఫల్యం తలెత్తింది. డీ జోన్లోకి జనం వచ్చారు. దీంతో ఎన్‌ఎస్‌జీ కమెండోలు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు చుట్టూ చేరిపోయారు. చుట్టుపక్కల జనం నిండిపోవడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది పూర్తిగా అప్రమత్తమైంది. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. పీలేరు సభా ప్రాంగణం జనసంద్రం అయింది. రోడ్లన్నీ జనంతో ట్రాఫిక్ జామ్ అయింది. జనం డి జోన్‌లో ఉండిపోయారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చెప్పినా జనం వెనక్కు వెళ్ళలేదు. తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండండి అంటూ చంద్రబాబు పలుమార్లు హెచ్చరించారు.

కాగా పీలేరులో రా కదలి రా సభకు జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సభా వేదిక వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు దూసుకువచ్చారు. రక్షణగా కట్టిన బారికేడ్లను దాటుకుని వేదిక వద్దకు వచ్చారు. సభా వేదిక ముందు డి సర్కిల్‌లోకి వేల మంది కార్యకర్తలు దూసుకొచ్చారు. సీఎం సీఎం అంటూ సభా ప్రాంగణం స్లోగన్స్‌తో హోరెత్తింది. కార్యకర్తలను అదుపుచేసేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో భద్రతా సిబ్బంది కంగారుపడింది. కార్యకర్తలను అదుపు చేయలేక ఇబ్బంది పడ్దారు.

కాగా శనివారం సాయంత్రం ఉరవకొండ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. రేపు (ఆదివారం) నెల్లూరు రూరల్, పత్తికొండల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న రాజమండ్రి రూరల్, పొన్నూరులో జరగనున్న సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.

‘రా.. కదలిరా!’ అన్న పేరుతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలిరా’ అని ఇచ్చిన నినాదానికి అశేష తెలుగు ప్రజానీకం మంత్రముగ్ధులయ్యారు. టీడీపీని అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆ నినాదాన్ని పేరుగా మార్చుకుని ఎన్నికల రణరంగంలోకి దిగాలని టీడీపీ నిర్ణయించింది. ‘రా.. కదలిరా’ పేరుతో ఈ నెలలో 12 రోజుల్లో మొత్తం 22 సభలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు.

Updated Date - Jan 27 , 2024 | 01:30 PM

Advertising
Advertising