ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సమస్యల పరిష్కారం కోసం..

ABN, Publish Date - Feb 15 , 2024 | 02:01 AM

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

చౌడేపల్లె ఎంపీడీవో కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జిలతో నిరసన

ఫ నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

చిత్తూరు, ఫిబ్రవరి 14: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసనలో పాల్గొన్నారు. చౌడేపల్లెఎంపీడీవో కార్యాలయంలో జేఏసీ ఆధ్వర్యాన.. కాణిపాకం జడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయులు.. పలమనేరు, గంగవరం మండలాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో.. కుప్పం ఆర్టీసీ డిపోవద్ద.. రామకుప్పంలో సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు నిరసన తెలిపారు. చిత్తూరులో జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి తాలూకా యూనిట్‌ అధ్యక్షుడు భానుప్రకాష్‌ మాట్లాడుతూ 30శాతం ఫిట్‌మెంట్‌తో 12వ పీఆర్సీని ప్రకటించాలని పలుమార్లు కోరినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరెండర్‌ లీవు, జీపీఎఫ్‌, ఏపీ జీఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌లు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని చెల్లించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలోనూ ప్రభుత్వం నేటికీ స్పష్టత ఇవ్వలేదన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఎన్‌ఆర్‌ఎం, పార్టుటైమ్‌, పుల్‌టైమ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులుగా నియామకమైన వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేంత వరకు తమ పోరాటాన్ని ఆపమన్నారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ సంఘ నేతలు రఘు, రమణ, చెంగల్రాయమందడి, ప్రదీ్‌పకుమార్‌, రమేష్‌, మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 02:01 AM

Advertising
Advertising