ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రోడ్డుపై మరుగుదొడ్డి నిర్మాణం

ABN, Publish Date - Feb 17 , 2024 | 11:59 PM

కోసిగిలోని 9వ వార్డుకు చెందిన అధికార పార్టీ వైసీపీ ముస్లీం మైనార్టీ నాయకుడు తన ఇంటి సందులోని రోడ్డుపై మరుగుదొడ్డిని నిర్మించడంతో రోడ్డుకు అడ్డంగా ఉందని వడ్డెనగర్‌కు చెందిన సుమారు 200 మంది కాలనీవాసులు శనివారం కోసిగి బస్టాండు సమీపంలోని ఆదోని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

వైసీపీ మైనార్టీ నాయకుడి నిర్వాకం

ఆగ్రహించిన కాలనీవాసులు

2 గంటలపాటు రోడ్డుపై బైఠాయింపు

కోసిగి, ఫిబ్రవరి 17: కోసిగిలోని 9వ వార్డుకు చెందిన అధికార పార్టీ వైసీపీ ముస్లీం మైనార్టీ నాయకుడు తన ఇంటి సందులోని రోడ్డుపై మరుగుదొడ్డిని నిర్మించడంతో రోడ్డుకు అడ్డంగా ఉందని వడ్డెనగర్‌కు చెందిన సుమారు 200 మంది కాలనీవాసులు శనివారం కోసిగి బస్టాండు సమీపంలోని ఆదోని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.చచ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో ఏఎస్‌ఐ నాగరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లికార్జున స్వామి, కానిస్టేబుల్‌ తిప్పన్న, సంజీవకుమార్‌ అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే.. వడ్డేనగర్‌ కాలనీవాసులు ఎల్లప్ప, వీరేష్‌, రామయ్య, ఉలిగయ్య, వెంకటేశ్‌, తిమ్మప్ప తో పాటు మరికొంత మంది మహిళలు ససేమిరా అని భీష్మించడంతో ఈవోపీఆర్‌డీ హరుణ్‌రషీధ్‌, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరుగుదొడ్డి కొంత భాగం మైనార్టీ సోదరులు కూల్చివేయడంతో మిగిలిన కొంత భాగాన్ని పంచాయతీ అధికారులు సిబ్బందితో కూల్చివేశారు. అధికారం ఉందనే అండతో వైసీపీకి చెందిన మైనార్టీ నాయకుడు రోడ్డుపై అడ్డంగా మరుగుదొడ్డి నిర్మించడం ఏమిటని కోసిగి ప్రజలు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారం కావడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. అక్కడి నుంచి స్థానికులు పంచాయతీ కార్యాలయం చేరుకొని రోడ్డుపై మరుగుదొడ్డి నిర్మించేందుకు పర్మీషన్‌ ఎలా ఇస్తారని అధికారులను నిలదీశారు.

Updated Date - Feb 17 , 2024 | 11:59 PM

Advertising
Advertising