Devineni Uma: టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ‘జెండా’ సభలో ప్రకటిస్తారు
ABN, Publish Date - Feb 27 , 2024 | 10:16 PM
టీడీపీ (TDP), జనసేన (Janasena) ఉమ్మడి బహిరంగ సభకు ‘జెండా’గా నామకరణం చేశామని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) తెలిపారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న ఈ సభలో టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటిస్తారని చెప్పారు.
టీడీపీ (TDP), జనసేన (Janasena) ఉమ్మడి బహిరంగ సభకు ‘జెండా’గా నామకరణం చేశామని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) తెలిపారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న ఈ సభలో టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటిస్తారని చెప్పారు. టీడీపీ, జనసేన పొత్తు అధికారంలోకి రాగానే.. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్‌పై (CM YS Jagan Mohan Reddy) దేవినేని ఉమా విరుచుకుపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారని ఆరోపించారు. కుప్పం బ్రాంచి కెనాల్‌లో రెండో లిఫ్టు నుంచి మూడో లిఫ్టుకు నీళ్లు తీసుకొచ్చేందుకు 57 నెలలు పట్టిందని గుర్తు చేశారు. కానీ జగన్ రూ.30 కోట్లు ఖర్చు పెట్టానంటూ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డ ఆయన.. నువ్వు ఉద్ధరించినట్టు చెప్పుకుంటావా? అని నిలదీశారు. ఎన్నికలకు పట్టుమని 40 రోజులు కూడా లేవని.. నీ మూడు రిజర్వాయర్ల డ్రామాలేంటి జగన్? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కుప్పం కెనాల్ పనులు 87 శాతానికి పైగా పూర్తయితే.. మిగిలిన 13 శాతం పనులు కూడా పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్ అని దుయ్యబట్టారు.
సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద జరిగిన హత్యయత్నం.. రాష్ట్రంలో అరాచక పాలకు నిదర్శనమని దేవినేని ఉమా పేర్కొన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో.. వారి అనుచరులు నాయకులపై దాడికి పాల్పడ్డారని, వెంటనే వాళ్లందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలులో ఈనాడు కార్యాలయంపై ఎమ్మెల్యే గుండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టారని.. పత్రికలు, న్యూస్ ఛానెళ్లకు సమాధానం చెప్పే ధైర్యం లేకే ఈ ప్రభుత్వం ఇలా దాడికి పాల్పడుతోందని విమర్శించారు. దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే అని అన్నారు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందా? రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందా? అని ప్రశ్నించారు.
Updated Date - Feb 27 , 2024 | 10:16 PM