ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పృచ్ఛకుల ప్రశ్నలు.. చమత్కారంగా సమాధానాలు..

ABN, Publish Date - Dec 16 , 2024 | 01:11 AM

పిఠాపురం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పృచ్ఛకులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, మధ్యలో అసందర్భ ప్రశ్నకలకు చిరు నవ్వుతో చమత్కారంగా స్పందిస్తూ భగవద్గీతలోని అంశాలను వివరిస్తూ చేసిన అష్టావధానం ఆసక్తికరంగా సాగింది. కాకినాడ జిల్లా పిఠాపురం శివారులోని విశ్వవిజ్ఞా

అష్టావధానంలో ప్రశ్నలకు సమాధానాలిస్తున్న అవధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు

పిఠాపురంలో భగవద్గీతపై అష్టావధానం

పిఠాపురం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పృచ్ఛకులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, మధ్యలో అసందర్భ ప్రశ్నకలకు చిరు నవ్వుతో చమత్కారంగా స్పందిస్తూ భగవద్గీతలోని అంశాలను వివరిస్తూ చేసిన అష్టావధానం ఆసక్తికరంగా సాగింది. కాకినాడ జిల్లా పిఠాపురం శివారులోని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన అవధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు నిర్వహించిన భగవద్గీత అష్టావధానం ఆకట్టుకుంది. పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ఆలీషా అధ్యక్షతన జరిగిన ఈ అవధానానికి గురు సహస్రావదాని డా క్టర్‌ గరిమెళ్ల వరప్రసాద్‌ సంచాలకులుగా వ్యవహరించారు. పృచ్చకులు లింగాల యాజ్ఞవల్కశర్మ, జోశ్యుల కృష్ణబాబు, అష్టావధాని కాకరపర్తి దుర్గాప్రసాద్‌, మార్ని జానకిరామచౌదరి, దాయన సురేష్‌చంద్రజీ, శతావధాని పోచినపెద్ది సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ వేదుల శ్రీరామశర్మ, సూరం పూడి వెంకటరమణలు వ్యవహరించారు. సుమా రు 6గంటల పాటు అష్టావధానం సాగింది.

ఆకట్టుకున్న నృత్యప్రదర్శన

అష్టావధానం జరిగిన వేదికపై పురాతన ఆగమశాస్త్ర పద్ధతుల్లో నిర్వహించిన ఆలయ దర్శనం నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. ప్రముఖ నాట్యాచారుడు సప్పాదుర్గాప్రసాద్‌ మార్గదర్శకత్వంలో నటరాజ నృత్యనికేతన్‌ కళాకారుల ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పలువురు కవులను, నృత్యప్రదర్శన ఇచ్చిన కళాకారులను డాక్టర్‌ ఉమర్‌ఆలీషా సత్కరించారు. కార్యక్రమంలో పీఠం ప్రతినిధులు ఆకుల రవితేజ, ఏవీవీ సత్యనారాయణ, ఎన్‌టీవీ ప్రసాదవర్మ, పింగళి ఆనంద్‌ తదితరులున్నారు.

Updated Date - Dec 16 , 2024 | 01:11 AM