ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బోటులో వంట చేస్తుండగా గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం

ABN, Publish Date - Feb 13 , 2024 | 01:22 AM

ఉప్పాడ (కొత్తపల్లి), ఫిబ్రవరి 12: నడి సముద్రంలో బోటులో వంట చేస్తుండగా గ్యాస్‌ లీకై ఆయిల్‌ ట్యాంక్‌ పేలిన సంఘటనలో బోటు పూర్తిగా దగ్ధమైందని ఉప్పా డ మత్స్యకార నాయకుడు, గ్రామ సర్పంచ్‌ ఉమ్మిడి జాన్‌ తెలిపారు. సూరాడపేట కు చెందిన సూరాడ కృష్ణ ఇంజన్‌ బోటుపై అదే పేటకు చెందిన 11

భైరవపాలెం సమీపంలో నడి సముద్రంలో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న బోటు

నడి సముద్రంలో బుగ్గి

సురక్షితంగా బయటపడ్డ 11 మంది జాలర్లు

ఉప్పాడ (కొత్తపల్లి), ఫిబ్రవరి 12: నడి సముద్రంలో బోటులో వంట చేస్తుండగా గ్యాస్‌ లీకై ఆయిల్‌ ట్యాంక్‌ పేలిన సంఘటనలో బోటు పూర్తిగా దగ్ధమైందని ఉప్పా డ మత్స్యకార నాయకుడు, గ్రామ సర్పంచ్‌ ఉమ్మిడి జాన్‌ తెలిపారు. సూరాడపేట కు చెందిన సూరాడ కృష్ణ ఇంజన్‌ బోటుపై అదే పేటకు చెందిన 11 మంది మత్య్య కారులు సోమవారం తెల్లవారుజామున నడిసముద్రంలోకి చేపల వేటకు బయలుదేరారు. ఉప్పాడ తీరం నుంచి సముద్రం భైరవపాలెం వైపునకు వేట చేస్తూ వెళ్లారు. మధ్యాహ్నం భోజనం తయారు చేసుకొనేందుకు బోటులోనే వంట చేసేందుకు గ్యాస్‌ స్టౌ వెలిగించారు. అప్పటికే లీకై ఉన్న గ్యాస్‌ స్టౌ వెలిగించిన క్షణాల్లో పక్కనే బోటు డీజిల్‌ ట్యాంక్‌ అంటుకోవడం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బోటులో ఉన్న మత్స్యకారులు హాహాకారాలు చేస్తుండడాన్ని గుర్తించిన సహచర మత్య్యకారులు వారిని వేరే బోటులో ఎక్కించి రక్షించారని సర్పంచ్‌ జాన్‌ తెలిపారు. మత్స్యకారులంతా సురక్షితంగా బయటపడగా, ఈ ప్రమాదంలో వేటాడిన చేపలు, వలలు, బోటు పూర్తిగా కాలిపోవడంతో రూ.25 లక్షల నష్టం వాటిల్లిందని చెప్పారు.

Updated Date - Feb 13 , 2024 | 01:22 AM

Advertising
Advertising