AP News: 11న దళిత సింహ గర్జన సభ: హర్షకుమార్
ABN, Publish Date - Feb 03 , 2024 | 01:57 PM
రాజమండ్రి: ఈనెల 11న దళిత సింహ గర్జన సభ నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం వాలెంటీర్ల ద్వారా మీటింగ్‌కు జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ..
రాజమండ్రి: ఈనెల 11న దళిత సింహ గర్జన సభ నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా మీటింగ్‌కు జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ సభకు జనం రాకుండా ఎవరైన అడ్డుకున్నట్టు తన దృష్టికి వస్తే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని.. వాలంటీర్లకు కూడా హెచ్చరిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ దళిత వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. దళితులపై హత్యలు, దాడులు జరుగుతున్నాయని, కోడికత్తి శ్రీనుకు ఐదేళ్ల నుంచి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సీతానగరంలో శిరోముండనం కేసులో వైసీపీ నేతల పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందని... వైసీపీ వ్యతిరేక పాలనపై తమ పోరాటం కొనసాగుతుందని, కాంగ్రెస్ లేకపోతే జగన్ ఎక్కడ ఉండేవారని హర్షకుమార్ ప్రశ్నించారు.
Updated Date - Feb 03 , 2024 | 01:57 PM