ఎన్నికల విధులు నిస్వార్థంగా నిర్వర్తించాలి
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:59 AM
నిస్వార్థంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్ని కల విధులు నిర్వర్తించాలని కొవ్వూరు డీఎస్పీ సీహెచ్ రామారావు అన్నారు. దేవరపల్లి బీహెచ్‌ఎస్‌ఆర్ వీఎల్‌ఎం డీగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఎన్నికల నియమావళిపై అవగాహన సదస్సు నిర్వహించారు.
హాజరైన గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లోని సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు
దేవరపల్లి, ఫిబ్రవరి 12: నిస్వార్థంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్ని కల విధులు నిర్వర్తించాలని కొవ్వూరు డీఎస్పీ సీహెచ్ రామారావు అన్నారు. దేవరపల్లి బీహెచ్‌ఎస్‌ఆర్ వీఎల్‌ఎం డీగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఎన్నికల నియమావళిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లోని అన్ని పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కొవ్వూరు సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని ప్రతి సెక్టార్ పోలీస్ అధికారి ఇంతకముందు జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌స్టేషన్ పరిధిలో జరిగిన గోడవలు, కొట్లాటలు గుర్తించాలని, ఏకపక్షంగా ఎన్నికలు జరిగిన ప్రదేశాలు, ఎన్నికల్లో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన వారిని ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసిన సంఘటనలు గుర్తించాలన్నారు. రాజమహేంద్రవరం నార్త్‌జోన్ డీఎస్పీ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమాచార వ్యవస్థను మెరుగుపరు చుకుని సమస్యలు సృష్టించే వ్యక్తులను ముందుగా గుర్తించి వారిని బైండోవర్ చేయాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి ఎన్నికల నియామవళి ప్రకారం విధులు నిర్వర్తించాలన్నారు. గంజాయి, సారా, మద్యం, నగదు, ఇతర నిషేధిత వస్తు వుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లా బోర్డర్ చెక్‌పోస్టులను బలోపేతం చేయాలన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేం దుకు ముందస్తూ చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో దేవరపల్లి, నల్లజర్ల, ధవళేశ్వరం సీఐలు కె.రామకృష్ణ, రామకృష్ణ, వినయమోహన్, దేవరపల్లి ఎస్‌ఐ శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 13 , 2024 | 01:00 AM