ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆ ఇంట్లో ఏమైంది!

ABN, Publish Date - Feb 12 , 2024 | 01:04 AM

దంపతుల మధ్య గొడవలతో అభంశుభం తెలియని చిన్నారులు నలిగిపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ శాటిలైట్‌ సిటీకి చెందిన గూడి సాయి కిరణ్‌కి యర్రవరానికి చెందిన దుర్గతో ఆరేళ్ల కిందట వివా హమైంది.కొంతకాలంగా ఇద్దరూ గొడవలు పడుతున్నారు.

ఇంట్లో నుంచి పొగలు.. గుర్తించిన స్థానికులు

గ్యాస్‌ లీకైందంటున్న తండ్రి.. భార్యతో గొడవలు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : దంపతుల మధ్య గొడవలతో అభంశుభం తెలియని చిన్నారులు నలిగిపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ శాటిలైట్‌ సిటీకి చెందిన గూడి సాయి కిరణ్‌కి యర్రవరానికి చెందిన దుర్గతో ఆరేళ్ల కిందట వివా హమైంది.కొంతకాలంగా ఇద్దరూ గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు సందీప్‌(4), ఏడాదిన్నర కూతురితో ఆమె అమ్మ గారింటికి వెళ్లి పోయింది. గత నెల 21న అత్తగారింటికి వెళ్లిన సాయి గొడ వపడి తన ఇద్దరు పిల్లలను తీసుకొని వచ్చేశాడు. ఏమైందో ఏమో గానీ ఆదివారం అతడి ఇంట్లో నుంచి పొగరావడం గమనించి వెళ్లి భయాం దోళన చెందారు.అప్పటికే అతడు,పిల్లలు తీవ్రగాయాలతో ఉన్నారు. వాళ్ల ను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.గ్యాస్‌ లీకై మం టలు అంటుకున్నాయని సాయి చెప్పాడు.అయితే పిల్లలకు కాళ్లు, చేతు లు, తలపై కాలిన గాయాలున్నాయి. గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించి నట్టుగా వారి పరిస్థితి లేదు. దీంతో సాయి కిరోసిన్‌ వేసి నిప్పంటించి ఉంటాడని భావిస్తున్నారు.ముగ్గురినీ మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వా స్పత్రికి తరలించారు.తల్లి దుర్గ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారని, ఆమె నేరుగా కాకినాడ వెళ్లారని..ఆమె స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 01:04 AM

Advertising
Advertising