ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటింటికీ వెళ్లి రోగులను నిర్ధారించండి

ABN, Publish Date - Sep 02 , 2024 | 12:15 AM

వైద్య శిబిరానికి ముందుకు గ్రామంలో పారా మెడికల్‌ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రోగులను నిర్ధారించాలని, అన్ని సీజనల్‌ వ్యాధులకు చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన కోరుకొండ అంకాలమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు.

కోరుకొండలో వైద్యులకు సూచనలిస్తున్న డాక్టర్‌ వెంకటేశ్వరరావు

  • వైద్యసిబ్బందితో డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వరరావు

  • కోరుకొండ సహా పలు చోట్ల వైద్యశిబిరాల పరిశీలన

కోరుకొండ, సెప్టెంబరు 1: వైద్య శిబిరానికి ముందుకు గ్రామంలో పారా మెడికల్‌ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రోగులను నిర్ధారించాలని, అన్ని సీజనల్‌ వ్యాధులకు చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన కోరుకొండ అంకాలమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారులు, పారా మెడికల్‌ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అన్ని సీజనల్‌ వ్యాధులకు సంబంధించి ఆరోగ్య విద్యను అందించాలన్నారు. సురక్షితమైన నీటిని తాగడం, వేడి ఆహారం తీసుకోవడం వంటి చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. వ్యాధి సోకడానికి ముందుగా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి సీజనల్‌ వ్యాధులు రాకుండా అరికట్టాలన్నారు. అనంతరం ఆయన దోసకాయలపల్లి పీహెచ్‌సీ పరిధిలోని నరేంద్రపురం, పాలచర్ల పీహెచ్‌సీ పరిధిలోని హౌసింగ్‌బోర్డు వద్ద ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శిబిరాలను సందర్శించినట్టు పేర్కొన్నారు. ఈ శిబిరంలో కోరుకొండ వైద్యాధికారి డాక్టర్‌ ప్రజ్ఞ, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 12:15 AM

Advertising
Advertising