జిల్లా స్థాయి గ్రీవెన్స్‌కు 352 అర్జీలు
ABN, Publish Date - Mar 12 , 2024 | 01:56 AM
ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికి స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ అన్నారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీదారుల నుంచి 33 ఫిర్యాదులు స్వీకరించారు.
కాకినాడ సిటీ, మార్చి 11: జగనన్నకు చెబుదాం- జిల్లాస్థాయి స్పందనకు 352 అర్జీలు అందాయి. సోమ వారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, జేసీ పీవీ ప్రవీణ్ ఆదిత్య, డీఆర్వో డి తిప్పేనాయక్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, సెట్రాజ్ సీఈవో కె.భారతి సౌజన్యలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను సత్వరం పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఈ కార్య క్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలె క్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో 33 ఫిర్యాదులు
కాకినాడ క్రైం, మార్చి 11: ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికి స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ అన్నారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీదారుల నుంచి 33 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారుల సమస్యలు తెలుసుకుని, సత్వర పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. స్పందనకు విచ్చేసిన అర్జీదారులకు డీపీఆర్ స్వామి ఆహారం పంపి ణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ బి సత్యనారాయణ, ఆర్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Mar 12 , 2024 | 01:56 AM