ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పనులు పూర్తవకుండానే.. ప్రారంభమా?

ABN, Publish Date - Mar 05 , 2024 | 12:05 AM

జిల్లాలోనే ప్రముఖ పర్యాట క కేంద్రంగా కాకినాడ బీచ్‌ ఉంది. కాకినాడ తీరాన్ని శోభాయమానంగా చేసేలా గతప్రభుత్వ హయాంలో స్వదేశీ దర్శన్‌ నిధులతో గ్లాస్‌హౌస్‌, ఫ్రంట్‌ బీచ్‌, లేజర్‌ షో, మ్యూజిక్‌ ఫౌంటేయన్‌ వంటి పర్యాటక హంగులను ఏర్పాటు చేసింది. బీచ్‌లో యుద్ధ వి మాన మ్యూజియం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

  • కాకినాడ బీచ్‌లో హడావుడిగా యుద్ధ విమాన మ్యూజియం ప్రారంభం

  • ఇంకా మిగిలి ఉన్న నిర్మాణ పనులు

  • ఎన్నికల ముందు ప్రచారం కోసమేనని విమర్శలు

  • ఇప్పటికే మూడున్నరేళ్లుగా జాప్యం

  • అసంతృప్తిలో సందర్శకులు

సర్పవరం జంక్షన్‌(కాకినాడ), మార్చి 3: జిల్లాలోనే ప్రముఖ పర్యాట క కేంద్రంగా కాకినాడ బీచ్‌ ఉంది. కాకినాడ తీరాన్ని శోభాయమానంగా చేసేలా గతప్రభుత్వ హయాంలో స్వదేశీ దర్శన్‌ నిధులతో గ్లాస్‌హౌస్‌, ఫ్రంట్‌ బీచ్‌, లేజర్‌ షో, మ్యూజిక్‌ ఫౌంటేయన్‌ వంటి పర్యాటక హంగులను ఏర్పాటు చేసింది. బీచ్‌లో యుద్ధ వి మాన మ్యూజియం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశానికి సేవలందిం చిన టీయే 142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ పనులు పూర్తికాకుండానే ఎన్నికల ముందు హడావుడిగా దీన్ని ప్రారంభించారు.

వినోదాన్ని పంచని మ్యూజియం

దేశ రక్షణ, భద్రత కోసం దేశ త్రివిధ దళాలు అందిస్తున్న సేవలపై చిన్నారులు, విద్యార్థులకు వినోదం, విజ్ఞానం పంచేందు కు యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మ్యూజియం ఏర్పాటుకు అప్ప ట్లో రూ.9.03 కోట్ల గుడా నిధులతో యుద్ధ విమాన మ్యూజి యం నిర్మాణ పనులకు 2020, అక్టోబరులో శంకుస్థాపన చేశా రు. బిల్లుల చెల్లింపు జాప్యంతో నిర్మాణపనులు నెమ్మదిగా సా గాయి. మూడున్నరేళ్ల తర్వాత గతనెల 26న యుద్ధ విమాన మ్యూజియాన్ని ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రారంభించారు. పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు జరగకపోయినా ఎన్నికలు సమీపిస్తుండడంతో హడావుడి గా దీన్ని ప్రారంభిచేసినట్టుగా తెలుస్తోంది. యుద్ధ విమా నం దేశానికి అందించిన సేవలు డిస్‌ప్లే, వీడియో, ఆడి యో ద్వారా తెలియచేసే సమాచారం, గేమింగ్‌ జోన్‌, విజ్ఞాన సమాచారం తెలియజేసే వ్యవస్థలు ఏర్పాటు చేయకుండానే ప్రారంభించడంపై విమర్శలువస్తున్నాయి.

ఏమీ పూర్తికాకుండానే..

యుద్ధ విమానం లోపల ఏసీ, విద్యుద్దీకరణ పూ ర్తిస్థాయిలో నిర్వహించలేదు. మ్యూజియం లోపల పూర్తిస్థాయిలో లైటింగ్‌ వ్యవస్థ కూడా లేదు. రా ష్ట్రంలో 3వ యుద్ధ విమాన మ్యూజియం ఏర్పా టు చేయడం గర్వకారణంగా ఉంది. ఇందులో యుద్ధ సమయంలో విమానాలను వినియోగిం చే తీరు, ఆయుధాల నిల్వ, వాటిని ఎలా ప్ర యోగిస్తారు, విమాన టేకాఫ్‌, ల్యాండింగ్‌ తదితర వివరాలను తెలియజేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కానీ ఇవేమీ ఏర్పాటు చేయకుండానే దీన్ని హడావుడిగా ప్రారంభించారు. అధికారులు విశాఖ తరహాలో అన్ని హంగులతో సత్వరంగా అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు. వేసవి సెలవులు రా నుండడంతో తొందరలో యుద్ధవిమా న మ్యూజియాన్ని సందర్శకులకోసం సిద్ధం చేసి ప్రవేశానికి అనుమతించాలని వారు కోరుతున్నారు.

ఇవిగో ప్రత్యేకతలు..

టీయూ-142 యుద్ధ విమానాన్ని రష్యాదేశం నుంచి కొనుగోలు చేశారు. కార్గిల్‌ యుద్ధంలో ఇది విశేష సేవలు అందించింది. ఈ విమానం ఒక్కసారి ఫ్యూయల్‌ నింపుకొని ప్రపంచ దేశాలను 16 గంటల్లో చుట్టి వచ్చే సామర్ధ్యం దీని సొంతం. ఇది గంటకు 925 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. విమానం పొడవు, వెడల్పులు 50 మీటర్లు, రెక్కల పొడవు 50 మీటర్లు ఉంటుంది. దీని బరువు 90వేల కిలోలు ఉండడం గమనార్హం. ప్రపంచంలోనే అతి భారీ, పురాతన యుద్ధ విమానాల్లో ఒకటైన టీయూ-142 ఎం ఎయిర్‌ క్రాప్ట్‌ భారత నావికాదళం వైమానిక విభాగంలో 28ఏళ్లపాటు దేశానికి విశేష సేవలు అందించింది. సముద్ర తీర గస్తీ, జలాంతర్గామి నిరోధక సేవలు అందించడంలో ఖ్యాతి గడించిన ఈ యుద్ధ విమానం 2017లో నేవీ నుంచి వైదొలిగి తమిళనాడులోని అరక్కోణం బేసల్‌ ఎయిర్‌స్టేషన్‌ ఐఎన్‌ఎస్‌ రాజసంలో విశ్రాంతి తీసుకుంటుంది. ఈ విమానాన్ని తమిళనాడునుంచి కాకినాడ బీచ్‌కు 14 భారీ వాహనాల ద్వారా పురాతన యుద్ధ విమానాన్ని తెనేజా ఏరో స్పేస్‌ లిమిడెట్‌ సంస్థ తీసుకువచ్చింది. ఫిబ్రవరి 25న ప్రారంభించారు.

Updated Date - Mar 05 , 2024 | 12:05 AM

Advertising
Advertising