ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన నాగబాబు

ABN, Publish Date - Dec 18 , 2024 | 12:39 AM

కరప, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన 44వ రాష్ట్ర మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌-2024 పోటీల్లో కాకి నాడ జిల్లా కరప సబ్‌యూనిట్‌ మలేరియా అధి కారి యాతం నాగబాబు సత్తా చాటి మూడు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. గుడివాడ ఎన్టీఆర్‌ స్పోర్ట్స్‌ స్టేడియంలో ఈనెల

3 బంగారు పతకాలు, సర్టిఫికెట్లతో నాగబాబు

బంగారు పతకాలను సాధించిన కరప సబ్‌యూనిట్‌ మలేరియా అధికారి

కరప, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన 44వ రాష్ట్ర మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌-2024 పోటీల్లో కాకి నాడ జిల్లా కరప సబ్‌యూనిట్‌ మలేరియా అధి కారి యాతం నాగబాబు సత్తా చాటి మూడు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. గుడివాడ ఎన్టీఆర్‌ స్పోర్ట్స్‌ స్టేడియంలో ఈనెల 14నుంచి రెండు రోజుల పాటు పరుగు పందెం పోటీలు జరిగాయి. 200మీటర్లు, 400మీటర్లు, 800మీటర్లు పరుగుపందెంలో వరుసగా మొదటి స్థానాలు సాధించి బంగారు పతకాలను గెలుచుకున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు రాజస్థాన్‌లోని ఆళ్వార్‌ వద్ద జరిగే 44వ జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు నాగబాబు ఎంపికయ్యారు. 2013 నుంచి ఇప్పటివరకు జరిగిన వివిధ జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఓపెన్‌ మీట్‌ పరుగుపందాల్లో పలు కేటగిరీల నుంచి 60 పతకాలను సాధించినట్టు మంగళవారం ఆయన విలేకరులకు తెలిపారు. అనంతరం కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీని మర్యాదపూర్వకంగా కలిసి తాను సాధించిన బంగారు పతకాలను, సర్టిఫికెట్లను చూపించారు. నాగబాబు ను ఎమ్మెల్యే కొనియాడి అభినందనలుతెలిపారు.

Updated Date - Dec 18 , 2024 | 12:39 AM