ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆహ్లాదం కనుమరుగు

ABN, Publish Date - Sep 01 , 2024 | 12:02 AM

మొక్కలు నాటండి.. వాటిని సంరక్షించండి అంటూ అటు నాయకులు ఇటు అధికారులు వనమహోత్సవంలో భాగంగా పిలుపునిస్తున్నారు.. అయితే కళ్లెదుట పచ్చదనం కనమరుగవుతున్నా అటు వైపు చూసే నాథులే కరువయ్యారు. ఇదెక్కడో మారుమూల కాదు.. అందరికీ తెలిసిన కొవ్వూరు గోష్పాదక్షేత్రం ఆవరణలో ఉన్న సుందరీకరణ పార్క్‌ పరిస్థితి. గత టీడీపీ ప్రభుత్వం రూ.25 కోట్లతో ఎంతో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన పార్క్‌ గత పాలకుల నిర్లక్ష్యంతో నేడు అధ్వానంగా తయారైంది.

సుందరీకరణ పార్క్‌లో పెరిగిన పిచ్చిమొక్కలు, తుప్పలు

  • మట్టిలో కలిసిపోతున్న రూ.25 కోట్లు

  • డంపింగ్‌యార్డుగా మార్చిన వైనం

  • అధ్వానంగా తయారైన ప్రాంగణం

  • పగిలిపోయిన విద్యుద్దీపాలు

  • రాత్రుళ్లు అసాంఘిక కార్యకలాపాలు

  • విషపురుగులు, పాముల సంచారం

  • మరమ్మతులకు గురైన ఆట వస్తువులు

మొక్కలు నాటండి.. వాటిని సంరక్షించండి అంటూ అటు నాయకులు ఇటు అధికారులు వనమహోత్సవంలో భాగంగా పిలుపునిస్తున్నారు.. అయితే కళ్లెదుట పచ్చదనం కనమరుగవుతున్నా అటు వైపు చూసే నాథులే కరువయ్యారు. ఇదెక్కడో మారుమూల కాదు.. అందరికీ తెలిసిన కొవ్వూరు గోష్పాదక్షేత్రం ఆవరణలో ఉన్న సుందరీకరణ పార్క్‌ పరిస్థితి. గత టీడీపీ ప్రభుత్వం రూ.25 కోట్లతో ఎంతో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన పార్క్‌ గత పాలకుల నిర్లక్ష్యంతో నేడు అధ్వానంగా తయారైంది.

కొవ్వూరు, ఆగస్టు 31: అఖండ గోదావరి పుష్కరాల సందర్భంగా కొవ్వూరులో గోదావరి ఏటిగట్టు రోడ్డును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. 2003 గోదావరి పుష్కరాల సమయంలో కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి టోల్‌గేటు సెంటరు నుంచి గోదావరిమాత విగ్రహం వరకు సుం దరీకరణ పనులు చేపట్టారు. మరలా 2015 పుష్కరాలకు సుందరీకరణ పనులను తాళ్లపూడి రోడ్‌లో గా మన్‌ బ్రిడ్జి వరకు పొడిగించారు. ఈ రెండు పుష్కరాళ్ల సమయాల్లో సుమారు రూ.25 కోట్లతో రోడ్డు కం రైలు బ్రిడ్జి నుంచి గామన్‌బ్రిడ్జి వరకు గోదావరి ఏటిగట్టుపై రెండువైపులా కాంక్రీట్‌ గోడలు నిర్మించారు. గోడలపై ఇనుపజాలీలను ఏర్పాటుచేసి మధ్యలో సప్త మహార్షుల విగ్రహాలు, వాకింగ్‌ ట్రాక్‌, పూలమొక్కలు వేసి పర్యాటకంగా అభివృద్ధి చేసి సుందరీకరించారు. అలాగే పట్టణ ప్రజలు వాకింగ్‌ చేసుకోవడానికి ట్రాక్‌ ఏర్పాటుచేశారు. ఆధ్యాత్మిక, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే విధంగా గోదావరి గట్టును సుందరీకరించారు.

  • గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం

అయితే మున్సిపాల్టీకి పార్క్‌ నిర్వహణ భారంగా మారడం, ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం సుందరీకరణ బండ్‌ను పట్టించుకోకపోవడంతో ఆహ్లాదాన్ని పంచవలసిన బండ్‌ చిట్టడవిని తలపిస్తోంది. పచ్చదనం మొత్తం ఆవిరి అయిపోయింది. విషపురుగులు, పాములకు నిలయమై ప్రజలు పార్క్‌లోకి వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. మరోవైపు ఇనుపజాలీలు విరిగిపోవడం, గోడలు బీటలు వారి పడిపోతున్నాయి. ఆకతాయిల విద్యుత్‌ దీపాలను పగలగొట్టి విద్యుత్‌ తీగలను దొంగిలించడంతో ఏటిగట్టు మొత్తం అంధకారం అలుముకుంటోంది. గోడలపై ఉన్న ఇనుపజాలీలను కొంతమంది విరగగొట్టి లోపలికి ప్రవేశించి, రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వ్యాయామ పరికరాలు, పిల్లల కోసం ఏర్పాటుచేసిన ఆట వస్తువులు, ఉయ్యాలలు తుప్పుబట్టి మరమ్మతులకు గురవుతున్నాయి. గామన్‌బ్రిడ్జి వద్ద నుంచి రాంచీలరేవు వరకు సమీప ప్రాంతాల్లోని ప్రజలు రోజులవారి చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్ధాలను తీసుకువచ్చి పార్క్‌ను కాస్తా డంపింగ్‌ యార్డు మార్చివేశారు.

  • పిచ్చిమొక్కలు, తుప్పలు

గోదావరి బండ్‌పై ఉన్న సుందరీకరణ పార్క్‌ను వివేకానంద, అంబేడ్కర్‌, గౌతమ మహర్షి, ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు వంటి మహానీయుల పేర్లతో పార్క్‌లుగా విభజించారు. ఆ పార్కుల్లో రూ.2.20 కోట్లతో వ్యాయామ పరికరాలు, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటుచేశారు. కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ తోటమాలి, నైట్‌వాచ్‌మేన్‌ను ఏర్పాటుచేయకపోవడంతో పార్క్‌లో పిచ్చిమొక్కలు, తుప్పలు ఏపుగా పెరిగి చిట్టడవిలా తయారైంది. విషపురుగుల సంచరిస్తున్నాయని ప్రజలు పార్క్‌లోకి రావడం మానేశారు. భక్తాంజనేయ స్నానఘట్టం నుంచి రోడ్డు కం రైలు బ్రిడ్జి వరకు కాగితం పువ్వులు, ఇతర ముళ్ల చెట్టుకొమ్మలు ఏపుగా పెరిగి సుందరీకరణ పార్క్‌ గోడలు దాటి బయటకు వచ్చేశాయి. ద్విచక్ర వాహనంపై కూర్చున్నవారికి చెట్టు కొమ్మలు కళ్లలలో గుచ్చకుని గాయాలపాలవుతున్నారు. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి ఈ చెట్టు కొమ్మలు తగిలి ప్రమాదాలకు గురవుతున్నారు.

  • పార్క్‌ నిర్వహణపై ఎమ్మెల్యే ముప్పిడి అసంతృప్తి

ఇటీవల కౌన్సిల్‌ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సుందరీకరణ పార్క్‌ నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తపరిచారు. పుష్కరాల సమయంలో యాత్రికులకు ఆహ్లాదాన్ని పంచిన సుందరీకరణ పార్క్‌లో పిచ్చిమొక్కలు, తుప్పలు పెరిగిపోయి ఆధ్వానంగా ఉందన్నారు. తుప్పలు, పిచ్చిమొక్కలను తొలగించి కడియం నర్సరీల నుంచి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పూలమొక్కలను నాటి సుందరంగా తీర్చి దిద్దాలన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి పార్క్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని మున్సిపల్‌ పాలకవర్గం, అధికారులకు సూచించారు.

  • బండ్‌ మొత్తం పర్యవేక్షించాలి: పట్టణస్థులు

కాగా గోదావరి బండ్‌ మొత్తం అధ్వానంగా తయారైందని, దానిని పర్యవేక్షించేందుకు తోటమాలిని, నైట్‌ వాచ్‌మేన్‌లను ఏర్పాటు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు. నిర్వహణ ఖర్చును తగ్గించుకునేందుకు లాంచీలరేవు, గోష్పాదక్షేత్రం, టోల్‌గేట్‌, సుబ్రహ్మణ్య స్నానఘట్టాల వద్ద అద్దె ప్రాతిపదికన మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే మున్సిపాల్టీకి కొంత భారం తగ్గడంతో పాటు ఆదాయం సమకూరుతుందని సూచిస్తున్నారు.

Updated Date - Sep 01 , 2024 | 12:02 AM

Advertising
Advertising