మొక్కలను పెంచుదాం..ఆరోగ్యాన్ని కాపాడుదాం: ఎమ్మెల్యే గోరంట్ల
ABN, Publish Date - Aug 31 , 2024 | 12:48 AM
మొక్కలను పెంచడం ద్వారా ఆరోగ్యం తోపాటు ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరం ట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొని మొక్కలు నాటారు.
రాజమహేంద్రవరం రూరల్/ కడియం, ఆగస్టు30: మొక్కలను పెంచడం ద్వారా ఆరోగ్యం తోపాటు ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరం ట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సంద ర్భంగా గోరంట్ల మాట్లాడుతూ మొక్కలు పెంచడం ద్వారా ఆరోగ్యకర వాతావరణం ఉంటుం దన్నారు. గత ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని, మహావృక్షాలను నేలకూల్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో అందరూ పాల్గొని మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలన్నారు. కార్యక్రమంలో మత్యేటి ప్రసాద్, మార్ని వాసుదేవరావు, మట్టా శ్రీను, బొప్పన నానాజీ, పండూరి అప్పారావు, ప్రత్యేకాధికారి జ్యోతి, ఎంపీడీ వో శ్రీనివాసరావు, కార్యదర్శి రూప్‌చంద్ పాల్గొన్నారు. కాగా కడియం ఉన్నత పాఠశాలలోనూ మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఇందులో ఎంపీపీ వెలుగుబంటి వెంకటసత్యప్రసాద్, సర్పంచ్ మోసిగంటి సత్యవతి, జనసేన మండల పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమీ, వెలుగుబంటి నాని, కడియపులంక సర్పంచ్-ఇన్‌చార్జి పాటంశె ట్టి రాంజీ పాల్గొన్నారు.
Updated Date - Aug 31 , 2024 | 12:48 AM